CM Revanth Meets Malkajgiri Leaders | మల్కాజ్ గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth reddy Tukkuguda Sentiment
Political News

CM Revanth Reddy : మల్కాజ్ గిరిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

 

– సిట్టింగ్ స్థానంపై సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్
– మల్కాజ్ గిరి నేతలతో కీలక సమావేశం
– హోలీ లోపు అభ్యర్థుల ప్రకటన
– కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది
– ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సూచన

CM Revanth Meets Malkajgiri Leaders : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అత్యధిక సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ స్థానమైన మల్కాజ్ గిరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తాను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదేనని అన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని తెలిపారు.

2,964 బూత్‌లలోని ప్రతీ బూత్‌లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్ గిరి అని, కేసీఆర్ పతనం 2019లో ఇక్కడి నుంచే మొదలైందని విమర్శించారు రేవంత్ రెడ్డి. వంద రోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నామని వివరించారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.

మల్కాజ్ గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామని వివరించారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా, జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా, కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు సీఎం. తెలంగాణ రాష్ట్రమంతా తుపాను వచ్చినట్లు గెలిచినా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని తెలిపారు. అందుకే, మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చిందని, పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని తెలిపారు. ‘‘మనకు బలమైన నాయకత్వం ఉంది. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే. ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలి. మల్కాజ్ గిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు. ముఖ్యమంత్రిది. నా బలం.. నా బలగం మీరే. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే’’ అని పార్టీ నాయకులకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..