ds chauhan
Politics

Paddy: దమ్ముంటే నిరూపించు!.. ఏలేటికి డీఎస్ చౌహాన్ సవాల్

– అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోం
– ఒక్క మిల్లర్ నుంచి అయినా కమీషన్ తీసుకున్నట్టు నిరూపిప్తారా?
– ఏలేటి వ్యాఖ్యలకు డీఎస్ చౌహాన్ ఛాలెంజ్
– తప్పుడు ప్రచారం చేస్తే చట్టప్రకారం ముందుకెళ్తామని వార్నింగ్
– రైతులు అధైర్య పడొద్దు
– ధాన్యం తడిసినా, మొలకెత్తినా మద్దతు ధరకే కొంటాం
– ప్రభుత్వ ఆదేశాలతో ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం
– సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

Civil Supplies: ధాన్యం కొనుగోళ్లు, బోనస్ విషయంలో మాటల మంటలు రాజుకున్నాయి. రైతులకు అన్యాయం జరుగుతోందనేది విపక్షాల వాదన అయితే, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని అధికార కాంగ్రెస్ అంటోంది. ఇరు పక్షాల విమర్శల దాడితో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పిన ఆయన, క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు.

రైతులకు ఆందోళన పడొద్దు!

అధికారులందరూ గ్రౌండ్ లెవెల్‌లో తిరుగుతున్నారని అన్నారు డీఎస్ చౌహాన్. ఆందోళనలో ఉన్న రైతులకు భరోసా ఇస్తున్నామని, ఈ సారి కొనుగోలు కేంద్రాలు మార్చి 25 కే ఓపెన్ చేశామని చెప్పారు. 7,172 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటిదాకా 39.51 టన్నుల ధాన్యం సేకరించినట్టు వివరించారు. గురువారం వరకు 83 శాతం అంటే 8,690 కోట్ల రూపాయలకు 7,208 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు.

మిల్లర్లపై కఠిన చర్యలు

రైతులకు తరుగు, తాలు విషయంలో ఇబ్బందులు లేకుండా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే నూతన టెక్నాలజీతో ఉన్న మిషన్ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు చౌహాన్. ధ్యానం తీసుకోని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోట్ల రూపాయలు బాకీ ఉన్నవారికి ధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ విచారణలో భాగంగా మిల్లర్ల వద్ద 6,068 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్టు వివరించారు. ధాన్యం డబ్బు ఎగవేత చేసిన మిల్లర్లపై రెయిడ్స్ చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోం!

తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొంటామని, కనీస మద్దతు ధరతోనే తీసుకుంటామని హామీ ఇచ్చారు చౌహాన్. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందన్న ఆయన, ఒక్క మిల్లర్ అయినా తనకు కమీషన్ ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీఎస్ చౌహాన్ కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారని, పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో డీఎస్ చౌహాన్ ఇలా రియాక్ట్ అయ్యారు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?