babu new cabinet
Politics

Amaravathi:సూర్యోదయాన..చంద్రోదయం

  • 24 మంది మంత్రులతో కొలువుతీరనున్న బాబు క్యాబినెట్
  • టీడీపీకి 21, జనసేనకు 2 ,బీజేపీకి 1 మంత్రి పదవులు
  • ఇంకా శాఖలు కేటాయించని చంద్రబాబు
  • డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఖరారు
  • సగానికి పైగా మంత్రులు కొత్తవాళ్లే
  • 8 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 1 ముస్లిం మైనారిటీ,
  • 1 వైశ్య, 4 కాపు, 4 కమ్మ, 3 రెడ్డి
  • ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు

Chandra babu naidu new cabinet ready with 25 ministers:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రి మండలి కూడా చంద్రబాబుతో పాటు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. బాబు మంత్రి వర్గంలో మొత్తం 24 మందికి చోటు కల్పించారు. 25 మంత్రులలో మిత్రపక్షాల నేతలకూ సమన్యాయం పాటిస్తూ మంత్రి పదవులను కేటాయించారు. మొత్తం మంత్రుల్లో టీడీపీకి 21, జనసేనకు 2 ,బీజేపీకి 1 మంత్రి పదవులు కేటాయించారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు.

సగానికి పైగా కొత్త మొహాలు

సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. అదే విధంగా మైనార్టీ వర్గాలను నుంచి ఎన్ఎండీ ఫరూక్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా విజయం సాధించారు. వీరిలో ఒకరికి లేదా ఇద్దరికి కేబినెట్‌లో బర్త్ దక్కే అవకాశం ఉంది. అయితే కేబినెట్‌ కూర్పులో సీనియారిటీతోపాటు.. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా పసుపు జెండాను వదలని వారిని సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.

కొత్త మంత్రులు వీరే

పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థనరెడ్డి, టీజీ భరత్ ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

భారీ ఏర్పాట్లు

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు చూసేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 45 ప్రాంతాలలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ వినోద్‌ కుమార్‌ ఆదేశాల కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు, ప్రజల కోసం వీటిని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో ఏర్పాటు చేసిన స్ర్కీనలో వేడుకలను కలెక్టర్‌ సహా జిల్లా ఉన్నతాధికారులు వీక్షించనున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ప్రధాన కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌, క్లాక్‌ టవర్‌, మున్సిపల్‌ కార్యాలయాలను వేడుకలకు ముస్తాబు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలను చూసేందుకు రాజధానికి వెళ్లేవారి కోసం 32 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. చంద్రబాబును అభినందిస్తూ ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!