KTR latest news(political news in telangana): మల్లారెడ్డి ఒక చోట ఉండడు కదా. ఏ పార్టీ అని కూడా చూడకుండా అలయ్ బలయ్ ఇచ్చుడేంది? ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని నువ్వే గెలుస్తావ్ అని కితాబిచ్చుడేంది? పార్టీలో నాయకులు జంప్ అవుతున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మల్లారెడ్డి మీద యాక్షన్ తీసుకోలేం. ఏం చేద్దామబ్బా? డ్యామేజీ కంట్రోల్ చేయడం మినహా మరే ఆప్షన్ కనిపించట్లేదే! మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందరే గెలుస్తారని మల్లారెడ్డి కామెంట్ చేసిన ఎపిసోడ్‌పై బీఆర్ఎస్ అధిష్టానం ఇలా మల్లగుల్లాలు పడి ఉంటుందని చెబుతున్నారు. కేటీఆర్ చేసిన డ్యామేజీ కంట్రోల్ కామెంట్లు ఇలాగే ఉన్నాయి మరీ!
మల్లారెడ్డి మామూలోడు కాదు
ఈటల రాజేందర్, మల్లారెడ్డి మధ్య జరిగిన సంభాషణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మన మల్లారెడ్డి పిచ్చోడు కాదు. ఆయన చాలా తెలివికల్లోడు. మల్లారెడ్డి ఎవరినైనా మునగ చెట్టు ఎక్కించి కింద పడేస్తాడు. ఈటల రాజేందరే గెలుస్తారని ఊరికే అనలేదు. ఈ మాటలతో రాజేందర్‌ను ఉబ్బించాడు. ఆ మాటలతో ఈటల రాజేందర్ ఖుష్ ఐతడు. నేను గెలిచినట్టే అని ఇంట్లో పడుకుంటాడు. ఆయన ఇంట్లో పడుకుంటే మేం ప్రచారం చేసి మల్కాజ్‌గిరిలో గెలువొచ్చని మల్లారెడ్డి ప్లాన్ వేసి ఉంటాడు… మల్లారెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా వచ్చే నేష్టమేమీ ఉండదు. మల్లారెడ్డి, ఈటల ఎపిసోడ్‌పై ఇదీ కేటీఆర్ రియాక్షన్.
జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు ఈ కవరింగ్ అవసరమా కేటీఆర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి చెప్పడంతో సహజంగా ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఆగ్రహం వస్తుంది. మల్లారెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వర్గం గుర్రుగా ఉన్నది.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్ చెట్టాపట్టాల్!
మల్లారెడ్డి వివరణ ఏం ఇచ్చారు?
‘ఈటల రాజేందర్ చాలా సంవత్సరాలు మా పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత మోసం చేయడంతో బయటికి వెళ్లిపోయాడు. చాన్నాళ్లకు ఓ ఫంక్షన్‌లో కలిశాడు. పాత మిత్రుడు.. కలవడంతో ఎవరైనా బాగున్నావా? అని అలయ్ బలయ్ తీసుకుంటారు కదా. ఏదో స్పోర్టివ్‌గా నేను కూడా నువ్వే గెలుస్తావ్ అని అన్నాను. దానికే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడ మా పార్టీ అభ్యర్థే గెలుస్తారు’ అని మల్లారెడ్డి ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.
సరదాగా పలకరిస్తే.. వైరల్ చేస్తరా?
‘అన్న నువ్వే గెలుస్తున్నావ్’ అన్న మాటను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగ్రహం. నిన్ను ఓ వివాహ వేడుకలో ఎదురుపడ్డ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ని.. అన్నా నువ్వే గెలుస్తున్నావ్.. అంటూ పలకరించిన… pic.twitter.com/puhLYHFUGb
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2024
ఏం జరిగింది?
పార్టీలతో పనేముంది అన్నట్టుగా ఆయన తీరు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేసి తర్వాత బయటకు పంపించబడిన కేసీఆర్ శత్రువు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాజాగా మల్లారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు. అరె, ఫొటో తీయండి అంటూ ఈటలతో కలిసి ఫోజిచ్చారు. అంతేనా, మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ఈటల రాజేందరే గెలుస్తారని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో వీరిద్దరూ కలిశారు.
అన్నా నువ్వే గెలుస్తున్నావ్!
ఈటలతో మాజీ మంత్రి మల్లారెడ్డిమల్లారెడ్డి మాటలను వ్యతిరేకిస్తున్న రాగిడి లక్ష్మా రెడ్డి వర్గం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారానికి నిదర్శనమే ఈ కలయిక అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు.#BJP #BRSparty #mallareddy #eatalarajendar #viralvideo… pic.twitter.com/5fnl9xAvoI
— BIG TV Breaking News (@bigtvtelugu) April 26, 2024