KTR (imagecredit:twitter)
Politics

KTR: ఆ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ఫుల్ ఫోకస్?.. ఎలాగైనా నెగ్గాల్సిందే..!

KTR: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నద్ధం అవుతుంది. అందుకోసం నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు కూడా ప్రారంభించింది. సుప్రీంకోర్టు మూడు నెలల్లొగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించడంతో మరింత ఉత్సాహంతో ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నవారు. అందులో భాగంగానే ఇప్పటికే రెండు నియోజకవర్గాల నేతలతో భేటీలు సైతం నిర్వహించారు. ప్రస్తుత పరిణామంతో నేతలంతా అలర్టు అయ్యారు. కాంగ్రెస్(Congress) లో చేరాలనుకునే కొంతమంది ఎమ్మెల్యేలు సైతం డైలమాలో పడినట్లయింది. బీఆర్ఎస్ మాత్రం ఇతర పార్టీల్లో చేరినవారు సైతం తిరిగి వస్తారనే ధీమాతో ఉంది.

పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు ఏదో ఒక చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది.దీంతో ఆ పదిమంది ఎమ్మెల్యేల్లో 5గురికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు ఇచ్చారు. పార్టీ మార్పు అంశంపై నాలుగు వారాల్లోకా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇక పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోబీఆర్(BRS)ఎస్ పార్టీ బలంపై ఆరా తీస్తుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థులు ఉండగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి సరైన క్యాండెట్ దొరకడంలేదు.

బీఆర్ఎస్‌కు సరైన అభ్యర్థి లేరు

ఖైరతాబాద్(Khairathabad) లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ తొలుత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) పేరు పరిశీలించినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆ సెగ్మెంట్ కు మన్నె గోవర్ధన్ రెడ్డి(Govardhan Reddy)కి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంకా బలమైన అభ్యర్థి కావాలని నేతల కోసం సెర్చ్ చేస్తుంది. స్టేషన్ ఘన్ పూర్ లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఆయనను పోటీలు నిలుపుతామని పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో ప్రచారం సైతం ప్రారంభించారు. చేవెళ్ల నియోజకవర్గంలో కాలే యాదయ్య(Kale Yadayya) పార్టీ మారిన తర్వాత అక్కడా బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి లేరు. భద్రాచలం నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, వాజేడు మండల మాజీ ఎంపీపీ బోదెబోయిన బుచ్చయ్య,గతంలో పోటీ చేసి ఓడిపోయిన మానే రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు వినిపిస్తోంది.

Also Read: GHMC: దోమల నివారణ పై చేతులెత్తేసిన అధికారులు.. విజృంభిస్తున్న దోమలు

బలమైన నేత కోసం బీఆర్ఎస్

అదే విధంగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Bandla krishna Mohan Reddy) పార్టీమారారు. దీంతో అక్కడ స్థానికంగా బలమైన నేత కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తుంది. సాట్స్ మాజీ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ పేరు బీఆర్ఎస్(BRS) వర్గాల్లో ప్రచారంలో ఉంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానంలోప్రకాష్ గౌడ్(Prakasah Goud) పార్టీ మారారు. దీంతో అక్కడ సబితాఇంద్రారెడ్డి(Sabitha Indhra Reddy) తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పేరు వినబడుతోంది. శేరిలింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ(MLA Gandhi) పార్టీ మారడంతో అక్కడ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. పటాన్ చెరు నియోజకవర్గంలో ఆదర్శ్ రెడ్డి ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్నా అక్కడ బలమైన అభ్యర్థి లేరు. జగిత్యాల నియోజకవర్గంలో ఎల్.రమణ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండటంతో ఎల్.రమణకు పూర్తిస్థాయిలో భాద్యతలు ఇస్తారా లేదా అనే దానిపై అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

కేటీఆర్ పర్యటనల ద్వారా

ఈ పదిమంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు డైరెక్షన్ తో బీఆర్ఎస్ అలెర్ట్ అయింది. పది అసెంబ్లీ నియోజకవర్గాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా కేటీఆర్ యక్షన్ ప్లాన్ రెడీ చేసకున్నారు. అందులో ఈనెల 24న శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్నినిర్వహించారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు హైదరాబాద్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆ నియోజకవర్గం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.సెప్టెంబర్ మొదటి వారంలో భద్రాచలం, ఆ తర్వా ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, ఇలా వరుసగా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో సమావేశం నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పార్టీ సిద్ధం చేస్తుంది. కేటీఆర్ పర్యటనల ద్వారా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్ ను యాక్టివ్ చేయడంతో పాటు ఉప ఎన్నికలు వస్తాయనే సంకేతం ఇవ్వాలనే టార్గెట్ గా పర్యటనలు

డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని కేడర్ కు భరోసా ఇస్తున్నారు. ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. అయితే ఒక వేళ ఉప ఎన్నికల్లు వస్తే పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు దొరుకుతారా? పార్టీ విజయం సాధిస్తుందా? అనేది చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీల అమలులో వైఫల్యాలే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉప ఎన్నికలు వస్తేమాత్రం రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

Also Read: BC Reservations: పార్టీ పరంగా 42 శాతం.. ప్రభుత్వ పరంగా పాత రిజర్వేషన్లే?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం