Dhande Vithal
Politics

BRS Party: కాంగ్రెస్‌లోకి దండే విఠల్?

– కీలక నేతలతో చర్చలు పూర్తి
– సీనియర్ల బాట పట్టనున్న ఎమ్మెల్సీ
– అనర్హత వేటు తప్పించుకునేందుకేనా?
– కోవా లక్ష్మి అడుగులూ అటేనా?

Defections: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మళ్లీ వలసలు మొదలయ్యాయా? గతంలో పార్టీ మారిన గులాబీ నేతల బాటలోనే మరికొందరు నేతలు పయనించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ మారుతున్నారనే వార్తలు ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలతో తన మనసులో మాటను తెలిపినట్లు, దానికి రాష్ట్ర నేతలూ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రేపో మాపో ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

పదవిని కాపాడుకేనేందుకేనా?
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. అయితే, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన నామినేషన్ చెల్లకుండా చేశాడంటూ ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పింది. కాగా, దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో ఆయనకు అక్కడ కొంత ఉపశమనం లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అండలేకుండా తాను ఎమ్మెల్సీగా కొనసాగలేననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అన్నీ కుదిరితే.. తనతో బాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులనూ కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు ఆయన రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, పార్టీ మారొద్దంటూ విఠల్‌ను బీఆర్ఎస్ నేతలు బుజ్జగించించారనీ, పార్టీలో కొనసాగితే పార్టీ పరంగా ఉన్నత పదవిని ఇస్తామంటూ చెప్పినట్లు సమాచారం. బుధవారం నాడు కేసీఆర్‌తో జరిగిన భేటీలోనూ ఆయనకు ఇదే హామీ లభించినట్లు తెలుస్తోంది. కాగా, కాగా, ఈ వార్తలను విఠల్, ఆయన అనుచరులు ఖండించారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వేళ.. విఠల్ పార్టీ మార్పుపై వినిపిస్తున్న ఊహాగానాలు సంచలనం కలిగిస్తున్నాయి.

కోవా లక్ష్మి దారెటో?
ఇదిలా ఉండగా, ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై గురువారం ఆమె స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వెళ్లిపోతున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడటంతో కోవాలక్ష్మి పార్టీ మార్పు వార్తలకు తెరపడింది.

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు