తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: KCR: బడ్జెట్ సమర్పించే రోజు అసెంబ్లీకి హాజరవుతానంటూ ఎమ్మెల్యేలకు ఇటీవల క్లారిటీ ఇచ్చిన కేసీఆర్.. ఈ నెల 19న హాజరు కాకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. గవర్నర్ స్పీచ్ రోజు హాజరైన ఆయన మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా వస్తారనే ఇప్పటివరకూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావించారు. కేసీఆర్ సైతం అదే స్పష్టత ఇచ్చారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా శనివారం చేసిన ఘాటు విమర్శలతో హాజరు కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు ఆయనతో పంచుకున్నట్లు తెలిసింది.
దీంతో హాజరు కావొద్దనే భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయమై ఇప్పటికీ ఎమ్మెల్యేలకు నిర్దిష్టమైన సమాచారం వెళ్ళలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేవలం రెండు రోజులే హాజరయ్యారని, కానీ ప్రభుత్వం నుంచి రూ. 57.84 లక్షల వేతనం తీసుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
also read: Telangana Govt: కుంభమేళాను తలపించేలా పుష్కర ఏర్పాట్లు.. కృష్ణా, గోదావరి పుష్కరాలపై ప్రారం..భమైన కసరత్తు
ఆశలు పుట్టించి.. ఊరించి… :
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే వార్త… అనే భావన నెలకొన్నది. దాదాపు ఏడాదికి పైగా పరిపాలనను చూశాం.. విమర్శలకు దీటుగా బదులిస్తాం… కొడితే మామూలుగా ఉండదు.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది.. అంటూ ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దీంతో ఇక ఫామ్ హౌజ్ విడిచిపెట్టి జనంలోకి వస్తారనే ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు భావించారు. వరంగల్‌ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలతో మొదలు పెట్టి జిల్లాల పర్యటన చేస్తారనే మెసేజ్‌ను కేడర్‌లోకి పంపారు. నిరుత్సాహంలో ఉన్న వారికి ఉత్సాహాన్ని కలిగించారు. గవర్నర్ ప్రసంగం రోజు హాజరు కావడంతో వారిలో ఆశలు చిగురించాయి. అదే తరహాలో బడ్జెట్ సమర్పించే రోజున కూడా గతేడాది లాగానే హాజరవుతారని భావించారు.
also read; CM Revanth reddy: అయ్యింది ఇంటర్వెల్లే… కేసీఆర్ పాపాల చిట్టా ఇంకా విప్పుతా! రెచ్చిపోయిన రేవంత్
కానీ సీఎం రేవంత్ (CM Revanth Reddy) తాజా వ్యాఖ్యలతో వెళ్ళకపోవడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చిన్లు తెలిసింది. బీఆర్ఎస్ (BRS) ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నప్పుడు కూడా సభకు హాజరవుతాననే క్లారిటీ ఇచ్చారు. తాజా పరిణామాలు మాత్రం ఆయన ఇక ఈ సెషన్‌కు హాజరు కారని, మళ్ళీ వచ్చే సంవత్సరమే వెళ్తారనే చర్చలు మొదలయ్యాయి.
జనాల్లో ఒకవైపు ఆయన అసెంబ్లీకి హాజరు కావడంలేదనే భావన నెలకొన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా హాజరవుతారంటూ స్పష్టత ఇచ్చారు. కానీ తాజా పరిస్థితులతో దూరంగా ఉండాలనే నిర్ణయంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయిందనే మాటలూ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంకోసమైనే కేసీఆర్ హాజరైతే బాగుంటుందని ఆ పార్టీలోని కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.