Hyderabad:బ్లాక్ బుక్ లో మొదటి పేరు మంత్రిదే
Padi Kaushik Reddy, BRS
Political News

Hyderabad: కౌశిక్ రెడ్డి హైడ్రామా

– పోలీసుల కళ్లు కప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కౌశిక్ రెడ్డి
– అక్కడి నుంచి సైలెంట్‌గా ఫిలింనగర్ ఆలయానికి
– పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు
– మంత్రి పొన్నం ప్రభాకర్‌పై అవినీతి ఆరోపణలు
– మంత్రి నీతివంతుడైతే ప్రమాణం చేసేందుకు ఎందుకు రాలేదని నిలదీత
– అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మంత్రుల అవినీతిని బయటపెడతామని హెచ్చరిక

BRS mla Padi kaushik reddy came film nagar venkateswara temple: ఫ్లై యాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల అవినీతిని పాల్పడ్డారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో మంగళవారం కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, బుధవారం హైడ్రామా నడుమ తెలంగాణ భవన్ నుంచి ఫిలింనగర్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఎలాగైనా తెలంగాణ భవన్‌కు చేరుకుంటానని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే, పోలీసులు వచ్చే సమయానికే ఆయన ఇంట్లో లేరు. పోలీసుల వలయం నుండి తప్పించుకుని తెలంగాన భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లారు.

పాదయాత్రకు అనుమతి లేదు

తెలంగాణ భవన్ నుంచి ఫిలింనగర్ వేంకటేశ్వర టెంపుల్ వరకూ పాదయాత్ర చేసి తడి బట్టలతో ప్రయాణం చేసేందుకు బయలుదేరారు కౌశిక్ రెడ్డి. పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకోవడంతో ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. స్వామివారి సాక్షిగా మంత్రి వచ్చి ప్రమాణం చేయాలని అడిగితే రాలేదని చెప్పారు. పొన్నం నీతివంతుడు అయితే, ఫ్లై యాష్‌ వ్యవహారంలో 100 కోట్ల స్కాం చెయ్యలేదని ప్రమాణం చెయ్యాలన్నారు. ‘‘ఐదేళ్ల తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసే అవినీతిపై బ్లాక్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్‌లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాస్తున్నా. మేము అధికారంలోకి రాగానే మంత్రి చేసిన 100 కోట్ల స్కాం బయటపెడుతాము.

వారికి లీగల్ నోటీసులు

ఫ్లై యాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి, కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ఆ వార్త ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్‌, టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లీగల్ నోటీసులు పంపించారు.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం