Padma Devender Reddy: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి
Padma Devender Reddy( image CREIT: SWTCHA REPORTER)
Political News

Padma Devender Reddy: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి : బీఆర్ఎస్ నేత పద్మాదేవేందర్ రెడ్డి

Padma Devender Reddy: కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షరాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) పిలుపునిచ్చారు.మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి సర్పంచ్,వార్డ్ స్థాననికి బరిలో ఉన్న అభ్యర్థుల కోడపాక సర్పంచ్ అభ్యర్థి గౌరీగారి. పంకజ కాశీనాథ్, శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థి లావణ్య నర్సింలు, బాచారం సర్పంచ్ అభ్యర్థి సొంగ. పవిత్ర దుర్గయ్య తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షరాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

హామీల అమలులో పూర్తిగా విఫలం

స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారూ, కానీ, పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళలు గ్రహించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు.

Also Read: BRS Diksha Divas: తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన త్యాగం కృషి మరువలేనిది: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఆ తర్వాత మొండి చేయి చూపిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చెప్పాలని కోరారు. సూచించారు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్‌ అభ్యర్థులకు ఓటేసి బారీ మెజార్జీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో కోడపాక మాజీ సర్పంచ్ లు సంగప్ప ,వెంకట్ రాములు మాజీ ఎంపీటీసీ చారి,నాయకులు దుర్గయ్య దత్తు,శ్రీనివాస్ గౌడ్ , బాలయ్య, దావిడ్,చాన్ బాషా, సాయి వర్ధన్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Also Read: Padma Devender Reddy: అన్నదాన కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్నా.. రైతులను ఆదుకోవాలని డిమాండ్

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..