Dasyam vinay bhaskar c
Politics

Telangana:‘అజాంజాహి’ పాపం కాంగ్రెస్ దే

మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కామెంట్స్:
వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి
గత ప్రభుత్వం చేసిన పనులకు వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర
గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న వినయ్ భాస్కర్
అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదు
నాడు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా కేసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం
24 అంతస్తుల ఆస్పత్రే అందుకు నిదర్శనం.
పేదల కోసం నిర్మించిన ఆస్పత్రిపై కాంగ్రెస్ కు శ్రద్ధలేదు.
ఆరు వేల కోట్లు ప్రతిపాదనలకు ఆరు కోట్లు కూడా కేటాయించని నిధులు
గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటామన్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

BRS ex mla Dasyam vinay bhaskar criticised cm Reventh about Ajamjahi mill
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..ఆజాం జాహి మిల్లును మూసివేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. శనివారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అజాంజాహి మిల్లును మూసేసి వేలాది మందిని రోడ్డున పడేసిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు.కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా కేసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. 24 అంతస్తుల ఆస్పత్రే అందుకు నిదర్శనమని అన్నారు. పేదల కోసం నిర్మించిన ఆస్పత్రిపై కాంగ్రెస్ కు శ్రద్ధలేదని.. కార్పొరేట్ ఆస్పత్రిని ప్రారంభించి అక్కడ గంటకు పైగా సమయం కేటాయించడమే ఆయన చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. వరంగల్ అభివృద్దిపై శ్రద్ధతో కాదు..ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఓపెనింగ్ కోసమే ఆయన వరంగల్ కు వచ్చారని..ఎంజీఎం ముందు నుండి వెళ్లిన సిఎం కనీసం ఎంజీఎంను విజిట్ చేయక పోవడం దారుణం అన్నారు. 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కాంట్రాక్టర్ ను బెదిరించడం కోసం సీఎం వచ్చినట్లు ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిలో వంకలు పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు.ఆరు వేల కోట్లు ప్రతిపాదనలు చేసి ఆరు కోట్లు కూడా నిధులు కేటాయించక పోవడం దారుణం అని.. మేం గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటాం..ప్రశ్నిస్తాం అని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు.

గత సర్కారు పనులకు వంకలు

వరంగల్ కు పూర్వవైభవం తీసుకొని రానికి.. మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ఈ ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..