Lotus Will Bloom BJP Party Every Where In Telangana
Politics

MLC Elections: బీజేపీ బహుముఖ వ్యూహం; గెలుపు కోసం పక్కా స్కెచ్

ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమల దళం
కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో
ఇప్పటికే ప్రచారంలో అగ్రనేతల జోరు
టీచర్ల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు

MLC Elections:  రాష్ట్రంలో ఈనెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) బహుముఖ్య వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఓ వైపు ప్రచారంలో అగ్రనేతల జోరు కొనసాగుతుండగా మరోవైపు టీచర్ల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాషాయ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అభ్యర్థుల తీరు మాత్రం గ్రౌండ్‌లో రియాలిటీకి దూరంగా ఉన్నట్లు తెలిసింది. గెలుపు అంత సునాయాసం కాదని, అభ్యర్థులకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని పార్టీ ఇన్ చార్జీ సునీల్ బన్సల్ పలువురికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సరళి పై బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. మీటింగ్స్ వద్దని, నేరుగా ఓటర్లను కలవాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. పెట్టిన మీటింగ్స్‌లో కూడా బీజేపీ కార్యకర్తలే ఉండటం వల్ల వచ్చే లాభమేంటని ఆయన నేతలకు చురకలంటించినట్లు తెలిసింది.

కష్టపడితేనే గెలుపు..
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు కోసం కాషాయదళం కుస్తీ పడుతున్నది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కేడర్ మొత్తాన్ని రంగంలోకి దించింది. అయినా ఇప్పటి వరకు 30 శాతం మంది ఓటర్లను మాత్రమే కలవడంపై బన్సల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిగిలిన వారిని ఎందుకు కలవలేకపోయారంటూ బన్సల్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కమిటీని ప్రశ్నించినట్లు తెలిసింది. గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, టఫ్ ఫైట్ ఉంటుందని బన్సల్ వివరించినట్లు టాక్. కష్టపడితేనే మూడు స్థానాల్లో గెలుస్తామని ఆయన తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని, హార్డ్ వర్క్ ముఖ్యమని ఆయన దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఓటర్లను కనీసం మూడు సార్లయినా నేరుగా కలవాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని వినియోగించుకోవాలని బన్సల్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును..
ఈనెల 27న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ చెమటోడ్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కానీ అభ్యర్థులు మాత్రం అత్యుత్సాహంతో వెళ్తున్నట్లు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే అంశం బన్సల్ దృష్టికి వెళ్లడంతో ఆయన క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. అభ్యర్థులు సంఘ పరివార క్షేత్రాల వనరులను ఉపయోగించుకోలేకపోతున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య పోటీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25, 921 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. కాగా గెలుపు కోసం ఒక్కో ఓటర్‌కు ఒక్కో కార్యకర్తను కాషాయ పార్టీ కేటాయించి క్యాంపెయిన్ చేస్తున్నది. ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని గట్టెక్కాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉండగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. దీంతో 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్ ని నియమించి తమదైన శైలిలో కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాల్లో పాల్గొని బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని కోరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కళ్లముందు ఉన్నాయని.. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదని ఓటర్లకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా దాన్ని నిరూపించాలని కాషాయ పార్టీ గట్టిగా ప్లాన్ చేస్తున్నది. మండలిలో సంఖ్యాబలం పెంచుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్యామ్నాయం అనిపించుకోవాలని భావిస్తున్న కమలదళానికి ఈ ఎన్నికల్లో కలిసొస్తాయా? లేదా? అన్నది చూడాలి.

ఇది కూడ చదవండి:

Meenakshi Natarajan: మీనాక్షి మార్క్ షురూ… మంత్రులు, ఎమ్మెల్యేల్లో మొదలైన గుబులు

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్