Ramchander Rao: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యేల నిద్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జరిగిన సభలో ఎమ్మెల్యేలు కునుకు తీసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆయన ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ ఉన్న నేఫథ్యంలో రాంచందర్ రావు (Ramchander Rao) ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నదీ జలాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలను కార్నర్ చేయడంలో బీజేపీ విఫలం అయ్యిందన్న చర్చ జరుగుతుండటంతో ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సైతం టాక్.
పార్టీ బలోపేతంపైనా దిశానిర్దేశం
ఇదిలా ఉండగా రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్ల సమావేశం జరగనుంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాంచందర్ రావు, అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. బూత్ స్వశక్తీకరణపై అభయ్ పాటిల్ సమీక్ష నిర్వహించనునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేతల మధ్య గ్యాప్, పార్టీ బలోపేతంపైనా దిశానిర్దేశం చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
హామీలను తక్షణమే అమలుచేయాలి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు దివ్యాంగులకు దుస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని ఊచించారు.
Also Read: Ramchander Rao: తెలంగాణలో విలువల్లేని రాజకీయాలంటూ.. రాంచందర్ రావు ఫైర్..?

