తెలంగాణ: BJP Maheshwar reddy: వరంగల్ బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ స్పీచ్ లో.. కొండంత రాగం తోసి, దిక్కుమాలిన పాట పాడారని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని విమర్శలు చేశారని, ఈ అంశంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
గాడిదకు గడ్డి వేసి బర్రెలకు పాలు పిండినట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉందని చురకలంటించారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తొచ్చారా అంటూ ధ్వజమెత్తారు. మావోయిస్టులను వెనకేసుకు రావడం సరైన పద్ధతా అని ఏలేటి ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తొచ్చారేమోనంటూ ఫైరయ్యారు. కేసీఆర్ హాయంలో ఎన్ కౌంటర్లు జరగలేదా అని నిలదీశారు. మావోయిస్టులను సమర్థించడాన్ని సమాజం ఒప్పుకోదన్నారు.
Also Read: Chicken Price Pakistan: ఇండియా దెబ్బకు పాకిస్తాన్ లో చికెన్ ధరలు పైపైకి
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. కేసీఆర్ మోడల్ దోపిడీ, నియంతృత్వ, నిర్బంధ, అవినీతి మోడల్ అని, కుటుంబ మోడల్, ఫెయిల్యూర్ మోడల్ అంటూ మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణలో కుటుంబపాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. పదేండ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులతో నాశనం చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో దోపిడీ జరిగిందని, ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
అది ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాదని, తిప్పి పోతల ప్రాజెక్ట్ అంటూ ఫైరయ్యారు. ఇదిలాఉండగా కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కాళేశ్వరం లొకేషన్ మార్పు బ్లెండర్ మిస్టేక్ అని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెబుతోందన్నారు.
కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసంతో అప్పులు పెరిగి రాష్ట్ర ప్రజలపై గుదిబండగా మారిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తోక పార్టీగా పనిచేస్తోందని, చెన్నై వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అక్రమాలు సీబీఐకి అప్పగించాలని ఏలేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Amravati capital Relaunch: అందరూ సిద్దంకండి.. మనకిక మంచి రోజులొచ్చాయి!