- సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
- కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్
- సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే
- సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే
- రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం
- తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కుట్ర
- అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
- ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణల పేరుతో జాప్యం
- సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్
Bandi Sanjay coments on BRS Congress on singareni privataisation:
తెలంగాణలో కొంగు బంగారం…. నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆర్ అని అన్నారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని అన్నారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్రమంత్రి తేల్చారని తెలిపారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్ర వాటా 49 శాతం మాత్రమేనన్నారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యమన్నారు.
వాస్తవాలు గ్రహించాలి
బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలని, ఇకనైనా కళ్లు తెరుచుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను తెలుసుకోవాలన్నారు. అవినీతి విషయంలో నాటి బీఆర్ఎస్ బాటలోనే నేడు కాంగ్రెస్ నడుస్తోందని బండి సంజయ్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం జరపడమే తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.