An Unexpected Development In The Case Of Saran Chaudary
Politics

Big Twist : బిగ్ ట్విస్ట్

– శరణ్ చౌదరి వ్యవహారంలో అనూహ్య పరిణామం
– మీడియాకు టచ్‌లోకి వచ్చిన విజయ్
– 5 కోట్లు తీసుకుని శరణే మోసం చేశాడని వెల్లడి
– గత ఆగస్టులో సీసీఎస్‌లో ఫిర్యాదు
– ట్విస్ట్ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
– శరణ్ ఎవరో తెలియదని స్పష్టం

An Unexpected Development In The Case Of Saran Chaudary: ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెగ నానుతోంది. ప్రత్యర్థి పరాజయం కోసం ఫోన్ ట్యాప్ చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తనకెలాంటి పాపం తెలియదని అన్నారు. ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి పరిచయాలు లేవని మాట్లాడారు. దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతుండగానే, వ్యాపారి శరణ్ చౌదరి, సీఎం, డీజీపీకి లేఖ రాయడం సంచలనం రేపింది. అందులో తనకు సంబంధించిన ఫ్లాట్‌ను చిత్ర హింసలు పెట్టి ఎర్రబెల్లి దయాకర్ బంధువు విజయ్‌ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదు చేశారు. దీనికి పోలీసులు రాధా కిషన్ రావు, ఉమామహేశ్వరరావు సహకరించారని పేర్కొన్నారు. మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయంపై వివరించారు. పోలీసులు వివరాలు తీసుకున్నట్టు చెప్పారు.

ఈ నేపథ్యంలో విజయ్ కూడా మీడియాకు టచ్‌లోకి వచ్చారు. ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. శరణ్ చౌదరే తమను మోసం చేశాడని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో 5 కోట్లు తీసుకుని మోసం చేశాడని చెప్పారు. సంగారెడ్డి సమీపంలో భూమి కొన్నాక రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరిగాడని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై 2023 ఆగస్టు 9న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. 2023 ఆగస్టు 21న సీసీఎస్ పోలీసులు శరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అంతా ఒప్పుకున్నారని విజయ్ తెలిపారు. పోలీసుల ముందే శరణ్ ఫ్లాట్‌ను విజయ్ కుమార్ పేరిట రిజిష్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. కానీ, శరణ్ మాత్రం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి డీసీపీ రాధా కిషన్ కలిసి తనను చీట్ చేశారని అంటున్నారు.

Read Also : టార్గెట్ 14

తన ఫ్లాట్ లాక్కొని, బెదిరించి 50 లక్షల నగదు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తన పేరు రావడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. శరణ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. విజయ్ అనే ఎన్ఆర్ఐ తన సమస్య చెప్పుకోవడానికి వచ్చారని, తాను కమిషనర్ దగ్గరకు పంపానని తెలిపారు. ఆయన తన బంధువేం కాదని స్పష్టం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవింతంలో ఎంతోమంది తనను ఇరికించాలని చూశారని, కానీ వారికి సాధ్యం కాలేదని చెప్పారు. కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా స్పందించారు. ఆ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని తెలిపారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?