Aggressiveness of IT Investigation Agency During Lok Sabha Elections
Politics

IT Searches : లోక్ సభ ఎన్నికల వేళ ఐటీ దర్యాప్తు సంస్థ దూకుడు

Aggressiveness of IT Investigation Agency During Lok Sabha Elections : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ అధికారులు తన పని తాను చేసుకుపోతుండగా, ఇంకోవైపు దర్యాప్తు సంస్థలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట తనిఖీలు చేస్తున్నాయి. ఈమధ్య మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీల్లో తనిఖీలు జరిపిన అధికారులు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, ఏపీసీసీ చీఫ్ షర్మిల వియ్యంకురాలు అట్లూరి పద్మను టార్గెట్ చేశారు. ఈమెకు సంబంధించిన చట్నీస్ హోటళ్లలో తనిఖీలు చేశారు.

మంగళవారం పలు హోటళ్లతోపాటు వాటి యజమానుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరిపారు. అట్లూరి పద్మ కుమార్తెను ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. జంట నగరాల్లో చట్నీస్ హోటల్స్‌కు పాపులారిటీ ఉంది. హైదరాబాద్‌లో అనేక బ్రాంచీలను కొనసాగిస్తున్నారు. ఐటీ పన్నులకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

Read More: శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలే బీజేపీ టార్గెట్

మరోవైపు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలోనూ సోదాలు జరిపినట్టు సమాచారం. ఓ ఫార్మా కంపెనీతోపాటు మరో 9 చోట్ల ఐటీ దాడులు కొనసాగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరులో బ్రాంచీలను కొనసాగిస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్ పైనా ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు