tsrtc jobs
Politics

Hyderabad: TSRTC జాబ్స్ ఇక రైట్ రైట్

  • టీఎస్ఆర్టీసీ పోస్టుల భర్తీకి శ్రీకారం
  • 3035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్
  • గత పదేళ్లుగా నియామకాలు చెయ్యని బీఆర్ఎస్ అన్న మంత్రి పొన్నం
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
  • 2 వేల డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ 743
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్ 84
  • డీఎం, ఎటీఎం, మెకానికల్ ఇంజనీర్ 40,
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23
  • మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11,
  • అకౌంట్స్ ఆఫీసర్ 6 చొప్పున ఖాళీలు

3035 posts in TSRTC job fill up congress government gave notification
ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది టీఎస్ ఆర్టీసీ. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఎనలేని ఆదరణ పొందింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీల్లో భాగంగా మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకునేందుకు కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ ఆర్టీసీ. గత పదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణలు తప్ప కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఈ కారణంగా ఆర్టీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమయింది.

3035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,035 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. అయితే ఖాళీల భర్తీకి గత కొన్ని రోజులు ఆర్టీసీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్టీసీలో 43వేల మంది పనిచేస్తుండగా పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం తెలిపారు. కాగా ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ 40, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఖాళీలు ఉన్నాయి. సర్కారు నియామకాల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ తర్వలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు