police
Politics

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. ఏకకాలంలో 28 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలికంగా బదిలీ ప్రక్రియ చేపట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో అది నిలిచిపోయింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. కొందరికి డైరెక్ట్‌గా బాధ్యతలు అప్పగించగా.. మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్
సూర్యపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్
ట్రాఫిక్ హైదరాబాద్, డీసీపీగా రాహుల్ హెడ్గే బీకే
జోగులాంబ గద్వాల్ ఎస్పీగా టీ శ్రీనివాసరావు
ఏసీబీ జేడీగా రితిరాజ్
కొమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
బాలానగర్ డీసీపీగా కే సురేశ్ కుమార్
మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్
సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
శంషాబాద్ డీసీపీగా బీ రాజేశ్
వికారాబాద్ ఎస్పీగా కే నారాయణ రెడ్డి
మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటి రెడ్డి
ఆదిలాబాద్ యాపలగూడ టీజీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్‌గా నితికా పంత్
యాంటీ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ ఎస్పీగా శరత్ చంద్రపవార్
సికింద్రాబాద్, రైల్వే ఎస్పీగా జీ చందనా దీప్తి
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పీ సాయి చైతన్య
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధనా రష్మి పెరుమాల్
నిజామాబాద్ డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిని ప్రియదర్శిని
జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బీ రాజ మహేంద్ర నాయక్
మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్