Dangerous Animal: మనకి తెలిసి భయంకరమైన జంతువులు పులి, సింహం, మొసలి, పాములు. కానీ, షాకింగ్ విషయం ఏంటంటే.. వీటన్నింటినీ మించి ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన జీవి ఉందని తెలుసా. ఇది నిజమేనా అని సందేహిస్తున్నారా? నిజమే. అది చాలా చిన్నగా ఉంటుంది. అదేదో కాదండి దోమ. అవును మీరు వింటున్నది నిజమే. ఒక చిన్న దోమ చాలా మంది ప్రాణాలను పోగొట్టుకునేలా చేస్తుంది. మనం ప్రతిరోజూ తేలికగా కొట్టి చంపే ఆ దోమే ప్రపంచంలో అత్యధికంగా మనుషుల ప్రాణాలు తీస్తోందని నమ్మలేని విషయాలు బయట పడ్డాయి.
ఏడాదికి లక్షలాది ప్రాణాలు గాల్లోకి..?
‘డిస్కవర్ వైల్డ్‌లైఫ్’ నివేదిక ప్రకారం, ప్రతి ఏడాది వరల్డ్ వైడ్ గా దోమల కారణంగా 7,25,000 నుంచి 10,00,000 మంది వరకు మరణిస్తున్నారు. ఈ సంఖ్య పులి, సింహం, పాము, మొసలి వల్ల కలిగే మరణాల కంటే మూడు రెట్లు ఎక్కువ. ఒక చిన్న కాటు, కానీ దాని ఫలితం ఘోరం.. ప్రాణాంతకం.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
వ్యాధుల మూలం.. దోమలే!
దోమలు నేరుగా మనుషులను చంపవు, కానీ ఇవి ప్రాణాంతక వ్యాధులను తీసుకొస్తాయి.
మలేరియా – ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్ల మందిని ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధి.
డెంగ్యూ జ్వరం – తీవ్రమైన జ్వరంతో పాటు రక్తపు ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల ప్రమాదకర పరిస్థితులు.
యెల్లో ఫీవర్ – ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి.
జికా వైరస్ – గర్భిణీ స్త్రీలలో తీవ్రమైన ప్రభావాలు చూపే వైరస్.
ఈ వ్యాధులన్నింటినీ ఒకసారి చూస్తే, దోమలు ప్రతి ఏడాది లక్షల మరణాలు, కోట్లాది వ్యాధి కేసులు వచ్చేలా చేస్తున్నాయి.
దోమల నుంచి రక్షణ చర్యలు
దోమల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
1. నిల్వ నీరు ఇంట్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం
2. మస్కీటో కాయిల్స్, వేప ఆయిల్, నెట్‌లు వాడటం.
3. శుభ్రత పాటించడం, ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు తొలగించడం.
4. డెంగ్యూ లేదా మలేరియా లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం.
