what causes insomnia and how can we overcome it
లైఫ్‌స్టైల్

Insomnia: నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా?

Insomnia: ఆహారం, నీళ్లు మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రతోనే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. రోజుకు కనీసం 8 గంటలు నిద్రించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు తర్వాత రోజు యాక్టివ్‌గా పనిచేయలేరని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో సరిగా నిద్రపోకుండా మేల్కొని ఉంటే ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, మధుమేహం, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు. సుఖమైన నిద్ర కోసం పడక గది నిశ్బద్ధంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రిస్తున్న సమయంలో రూమ్‌లో ఎక్కువ వెలుతురు ఉండకూడదు.

సాయంత్రం తర్వాత టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు. ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పగలు సమయంలో ఒక చిన్న కునుకు వేస్తే సరిపోతుంది. అంతేకానీ ఎక్కువ సేపు పడుకోకూడదు. రాత్రి బాగా నిద్రపట్టాలంటే గోరు వెచ్చని పాలని తాగండి. పాలలో ఉన్న ట్రిస్టోఫ్యాన్‌ వల్ల బాగా నిద్రపడుతుంది. నిద్రించేముందు బుక్స్‌, టీవీ చూడటం చేయొద్దని నిపుణులు అంటున్నారు.అంతే కాకుండా ఆల్కహాల్‌ అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. నిద్రలోనూ మన మెదడు పనిచేస్తుంటుంది. కాకపోతే చురుకుదనం, పరిసరాలపై చైతన్యం తగ్గుతుంది. అవయవాలు, మెదడు బాహ్య విషయాలను మరచిపోయి విశ్రాంతి తీసుకోవడమే నిద్ర ఉద్దేశం. చిన్నారులు, యువకుల్లో నిద్రపోయే సమయంలోనే శరీర ఎదుగుదలకు అవసరమైన గ్రోత్‌ హార్మోన్‌ విడుదల అవుతుంది.

Insomnia: నిద్రపోయే సమయం అందరిలో ఒకేలా ఉండదు. పసిపిల్లలు రోజుకు 16 గంటలయినా పడుకుంటారు. యుక్త వయసు ఉన్నవారు 8 నుంచి 9 గంటలు నిద్రిస్తారు. పెద్దలు రోజుకు 5 నుంచి 9 గంటలు నిద్రపోవడం అవసరం. సరిగా నిద్రపోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. శరీర సామర్థ్యంకూడా తగ్గిపోతుంది. పగటిపూట నిద్ర పోవడం వల్ల ఆందోళన, చికాకు వస్తుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వస్తుంది. కాబట్టి రాత్రి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

అన్నీ బాగానే ఫాలో అవుతున్నా కూడా కొంద‌రికి నిద్ర‌లేమి స‌మ‌స్య చాలా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటి వారు క‌చ్చితంగా ఓసారి వైద్యుల‌ను సంప్ర‌దించాలి. ఎందుకంటే శ‌రీరం, మెద‌డు లోప‌ల ఏం జ‌రుగుతోందో మ‌న‌కు తెలీదు. అన్ని ల‌క్ష‌ణాలను గుర్తించ‌లేం. కాబ‌ట్టి ఈ ఒక్క విష‌యంలో వైద్యుల‌ను సంప్ర‌దించి వారి స‌ల‌హా తీసుకోవాల్సి ఉంటుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!