singles dating style is changing
లైఫ్‌స్టైల్

Dating: డేటింగ్ స్టైల్ మారుతోంది గురూ..!

Dating: ఇది వ‌ర‌కు డేటింగ్ అంటే కాఫీ తాగేందుకో లేదా ఏద‌న్నా రెస్టారెంట్‌కి వెళ్లి డిన్న‌ర్ చేయ‌డ‌మో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఓయోల‌కు వెళ్లిపోతున్నార‌న‌కోండి. ఈ విషయం ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు మిలీనియ‌ల్స్, జెన్ జి త‌మ డేటింగ్ స్టైల్‌ని మార్చేసుకున్నారు. ఇప్పుడు రెస్టారెంట్ల‌కు, కాఫీ డేట్ల‌కు వెళ్ల‌డం లేదు. మ్యూజిక్ కాన్స్‌ర్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. హ్యాపన్ (happn) డేటింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, 74 శాతం భారతీయ సింగిల్స్ తమ తొలి డేట్‌కి కన్సర్ట్‌లను బెట‌ర్ ఆప్ష‌న్‌గా భావిస్తున్నారు, 67 శాతం మంది లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ల వల్ల డేటింగ్ సులభంగా మారుతుందని చెబుతున్నారు. ఇటీవల భారతదేశం కన్సర్ట్ కల్చర్‌పై దృష్టిపెట్టడం (ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిని ప్రోత్సహిస్తున్నారు) చూస్తుంటే, ఇవి కేవలం సంగీతం, అభిమానంతోనే కాదు – కన్సర్ట్‌లు ఇప్పుడు కొత్త మ్యాచింగ్ హాట్‌స్పాట్‌లుగా మారాయి.

2025లో కొత్త డేటింగ్ ట్రెండ్

Dating గతంలోలా కేవలం కలిసే సందర్భం మాత్రమే కాదు, ఇప్పుడు డేటింగ్ అనేది జ్ఞాపకాలు సృష్టించుకోవడం, అనుభవాలను పంచుకోవడం. ఉదాహరణకు, పార్ట్‌న‌ర్‌తో కలిసి పప్పీ యోగా సెషన్‌కి వెళ్లడం లేదా పెయింటింగ్ సెషన్‌కి హాజరవ్వడం… ఇప్పుడు యాక్టివిటీ-బేస్డ్ డేటింగ్ ట్రెండ్ మారుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ ఈవెంట్‌లు సింగిల్స్‌కు కొత్త అనుబంధాలను ఏర్పరచే అద్భుత అవకాశంగా మారుతున్నాయి. Coldplay A Sky Full of Stars పాటని ఇద్ద‌రూ క‌లిసి ఎంజాయ్ చేయ‌డం.. ఫీలింగ్స్ షేర్ చేసుకోవ‌డం.. Ed Sheeran గిగ్‌కి వెళ్ళి కలిసి పాడుకోవ‌డం లేదా Lollapaloozaలో కొత్త ఇండీ టాలెంట్‌ని కనుగొనడం.. ఇలాంటి ఈవెంట్‌లు ఇప్పుడు కొత్త రొమాన్స్‌కు వేదికగా మారుతున్నాయి.

మ్యూజిక్‌తో ప్రేమకథలు

happn CEO, ప్రెసిడెంట్ కరీమా బెన్ అబ్దెల్మాలెక్ ఇదే విష‌యం గురించి ప్ర‌స్తావించారు. Gen Z డేటింగ్ ల్యాండ్‌స్కేప్‌ను పూర్తిగా మార్చేస్తోంది. మ్యూజిక్ ఇప్పుడు వారి సోషల్ లైఫ్‌లో కీలకమైన భాగం. భారతీయ సింగిల్స్ యాక్టివిటీ-బేస్డ్ డేటింగ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మ్యూజిక్ ఫెస్టివల్ సీజన్‌తో కలిసి, ఇది కొత్త బంధాన్ని, జీవితాన్ని ప్రారంభించడానికి అద్భుత అవకాశం అని అంటున్నారు.

కన్సర్ట్‌లు ప్రేమకు ఏవిధంగా సహాయపడతాయి?

సైకోథెరపిస్ట్ డాక్టర్ చాంద్ని టుగ్నైట్ (Founder-Director, Gateway of Healing) చెబుతున్నట్టు ఒకరి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే మాటలు తప్పనిసరి. కానీ లైవ్ మ్యూజిక్ అనుభవం భాగస్వామ్యుల మ‌ధ్య‌ భావోద్వేగ అంశాల‌ను తెలియ‌జేస్తుంది. ఇది కేవలం ఒక షో చూడటం కాదు, అది ఒక అనుభూతిని పంచుకోవడం. అలాగే, కన్సర్ట్ వాతావరణంలో నిరంతరం సంభాషించాల్సిన ఒత్తిడి ఉండదు, అందుకే ఇది డేటింగ్‌ను మరింత సహజంగా మారుస్తుంది.

డేటింగ్‌లో ఉన్న భాగ‌స్వామ్యుల‌ మ్యూజిక్ టేస్ట్ ఒకేలా ఉంటే, అది ప్రేమకు దారితీయవచ్చు!

48% భారతీయ సింగిల్స్ ప్రకారం, ఒకరి డేటింగ్ ప్రొఫైల్‌లో వారి ఇష్టమైన మ్యూజిక్ ఆర్టిస్ట్ కనబడితే, ఆ వ్యక్తిపై ఆకర్షణ పెరుగుతుంది.

74% భారతీయులు కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మ్యూజిక్‌ని ఐస్ బ్రేకర్‌గా ఉపయోగిస్తారు. ఐస్ బ్రేక‌ర్ అంటే ఏం మాట్లాడాలో తెలీన‌ప్పుడు ఏదో ఒక అంశంతో సంభాష‌ణను మొద‌లుపెట్ట‌డం. ఇప్పుడు డేటింగ్ ప్ర‌క్రియ‌లో మ్యూజిక్ ఐస్ బ్రేక‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు.. మీ భాగ‌స్వామితో ఏం మాట్లాడాలో తెలీక ఇబ్బందిప‌డుతుంటే.. మీకు రెహ‌మాన్ పాట‌లు ఇష్ట‌మా అని అడ‌గండి. అక్క‌డి నుంచే మీ మాట‌లు మొద‌లైపోతాయి.

79% మ్యూజిక్ రొమాన్స్‌కు మూడ్ సెట్ చేస్తుందని నమ్ముతున్నారు. అంటే మీ ప్లేలిస్ట్ మీ డేట్ ఫస్ట్ ఇంప్రెషన్‌ను ప్రభావితం చేయవచ్చు.

76% ఇష్టమైన వ్యక్తితో కొత్త పాటలు కనుగొన‌డాన్ని ఇష్టపడతారు. కనుక షేర్డ్ కన్సర్ట్ అనుభవాలు ప్రేమకథలా మారుతున్నాయి.

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే