Food Poisoning: నిత్యం తీసుకునే ఆహారాల్లో కొన్ని మన శరీరానికి పడవు. దీంతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేకాకుండా జ్వరంతో పాటు తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన చర్మంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. దీన్ని ఫుడ్‌బోర్న్ ఇల్‌నెస్ అంటారు. మన భాషలో చెప్పాలంటే ఫుడ్ పాయిజనింగ్ అంటారు. కలుషితమైన ఆహారం, చెడిపోయిన ద్రవాలను తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో, చిన్నపిల్లలు, గర్భిణుల్లో, షుగర్, ఎయిడ్స్, క్యాన్సర్ ఉన్నవారిలో కూడా ఫుడ్ పాయిజన్ ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా ఉంటే ఫుడ్ పాయిజన్ తక్కువగా ఉంటుంది.
ఆహారంతో పాటు పలు రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు మన గట్ ఫంక్షన్లకు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మక్రిములు మన ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవడానికి ఎంటామీబా ఒక కారణం. క్యాంపిలో బాక్టర్ బ్యాక్టీరియా, ఈ కోలి బ్యాక్టీరియా, నోరోవైరస్, సాల్మొనెల్లా బ్యాక్టీరియాల వల్ల కూడా ఫుడ్ పాజియిన్ అవుతుంది. ఎక్కువగా ఉడకని మాంసం, కలుషిత నీరు, పాత పిండిలో ఈ రకం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాత తింటే క్రిములు నశిస్తాయి. మురుగు నీరు, డ్రైనేజీ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాలను దూరం పెట్టడం మంచిది.లేకపోతే మీరు టైఫాయిడ్ బారిన పడే అవకాశం ఉంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కూరగాయల్లో ఉంటుంది. దీని వల్ల విరోచనాలు, డయేరియా, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుషిత ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు లేదా టాక్సిన్‌ల వల్ల సంభవించవచ్చు. కలుషిత ఆహారం సరిగ్గా వండకపోవడం, నిల్వ చేయకపోవడం లేదా కలుషితమైన ప్రదేశంలో తయారు చేయడం వల్ల కలుషితమవుతుంది.
లక్షణాలు:
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటాయి. సాధారణ లక్షణాలలో వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం మరియు చలి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో, ఆహార విషం డీహైడ్రేషన్, బలహీనత మరియు కండరాల నొప్పులకు కూడా దారితీస్తుంది.
నివారణ:
Food Poisoning ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయండి.
ఆహారాన్ని వండే ముందు మరియు తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.
ఆహారాన్ని పూర్తిగా ఉడికించాలి.
పాడైపోయిన ఆహారాన్ని తినకూడదు.
తాజా పండ్లు మరియు కూరగాయలను బాగా కడగాలి.
నీటిని శుభ్రంగా తాగాలి.
ఆహార విషం యొక్క లక్షణాలు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆహార విషం తేలికపాటి సమస్య అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకమైనదిగా కూడా మారుతుంది. కాబట్టి, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.