Health Tips: ఉల్లిపాయ రసం తాగితే జరిగేది ఇదే!
Onion ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Health Tips: రోజూ ఉల్లిపాయ రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం శరీరంపైన ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా ఉంటాం. ఈ సందర్భంలో ఉల్లిపాయ రసం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి అవసరమైన మంచి పదార్థాలు ఇందులో ఉండటం వల్ల హృదయానికి కూడా మేలు చేస్తుందట. ఉల్లిపాయ రసాన్ని తలకు రాస్తే చుండ్రు తగ్గడం, జుట్టు రాలడం తగ్గిపోవడం, జుట్టు బలంగా పెరగడం వంటి ప్రయోజనాలు కనిపిస్తాయని హెయిర్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు తాగితే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గే అవకాశముంది. కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించడంలో కూడా ఉల్లిపాయ రసం సహాయపడుతుందని కొన్ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎముకలకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలో ఉండటం వల్ల ఇది ఎముకల బలాన్ని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ ఉపయోగకరమని చెబుతారు. చూపు తగ్గిన వారు కొంత కాలం ఉల్లిపాయ రసం తీసుకుంటూ ఉంటే ప్రయోజనం కనిపించవచ్చని సూచనలు ఉన్నాయి. బరువు తగ్గించుకునే వారికి కూడా ఉల్లిపాయ రసం ఒక మంచి పానీయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి, రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను మాత్రమే కాకుండా, అవసరానికి తగ్గట్టు దాని రసాన్ని కూడా శరీరానికి ఇవ్వడం ఆరోగ్యానికి ఉపయోగకరమని నిపుణులు పేర్కొంటున్నారు.

Just In

01

BRS Strategy: హంగామా చేస్తున్న బీఆర్ఎస్.. గులాబీ అటెన్షన్ డైవర్షన్?

Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

Coal Block Allegations: సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు?.. కేంద్ర మంత్రికి హరీష్ రావు కీలక లేఖ

Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్