Neem Leaves: వేప మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఇది అనేక అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి, శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను చంపడానికి వేప కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నోటి సమస్యలకు చెక్ పెట్టగలదు. ఒక గ్లాసు వాటర్ ను తీసుకుని, దానిలో వేప నూనె 2 స్పూన్స్ కలిపి పుక్కిలించాలి. ఇలా చేయడం వలన చిగుళ్ల వాపు, దంతాల నుంచి రక్తం కారడం, మౌత్ అల్సర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read : Koneru Satyanarayana: సీఎం రేవంత్ పై విమర్శలు చేసే స్థాయి ఉందా? మాజీ ఎమ్మెల్యే వనమాకు కోనేరు ప్రశ్న
పాదాల పగుళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాదాలను గోరు వెచ్చని నీళ్ళతో కడిగి వేప నూనెతో మర్దన చేసుకుంటే.. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వేప నూనెకు బదులుగా వేపాకుల పేస్ట్ ను కూడా వాడొచ్చు. మొటిమలు, నల్ల మచ్చలతో బాధ పడుతున్న వారు ముఖానికి వేపనూనెను రాసుకుని 20 నిమిషాల తర్వాత నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వలన కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి. వేప పుల్లలను బాగా ఎండబెట్టి, పొడి చేసుకొని, ఒక టీ స్పూన్ గోరువెచ్చని నీటితో కలుపుకొని తీసుకోవడం వలన కడుపు లో పుండ్లు, అలర్జీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ షాక్… తుప్పు పట్టిన మొబైల్ ఫోన్ తెచ్చిన శ్రవణ్ రావు?
కొందరు తలలో చుండ్రు సమస్యతో ఎంతో బాధపడతారు. దీని తగ్గించుకోవడం కోసం డబ్బు పెట్టి మరి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారు వేప నూనెతో మర్దన చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వేపతో అందాన్ని మరింత పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఫేస్ మాస్క్ వారానికొకసారైనా వేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుంది. వేపాకులను నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి, ఈ మిశ్రమాన్ని పసుపుతో కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ఇరవై నిమిషాల తర్వాత తీసి, గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.