Best Food: మన దేశంలో ఎన్నో రకాలు ఆహారాలు ఉన్నాయి. వాటిలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ , రైస్ ఫుడ్స్ ఇలా ఒకటి కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వంద శాతం రేటింగ్ ఇచ్చిన ఫుడ్ ఉందని తెలుసా? అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పోషకాలను, ఖనిజాలు, ప్రోటీన్స్ ఇలా అన్ని సమృద్ధిగా ఉండే ఒకే ఒక్క ఫుడ్ తల్లిపాలు. పుట్టిన పిల్లలకు, తల్లిపాలు మంచి ఆహారం. తల్లి పాలు ఎడమ వైపు పాలు నిండుగా ఉంటాయి. కుడి వైపున తక్కువగా ఉంటాయి. మొదటి దానిలో నీరు ఎక్కువగా ఉంటుంది. రెండవ దానిలో నీరు తక్కువగా ఉండి ఆకలిని తీరుస్తుంది.
ఈ వరల్డ్ లో వంద శాతం రేటింగ్ పొందిన ఏకైక ఆహారం తల్లి పాలు మాత్రమే. మనకు దొరికే ఎన్నో వేల ఆహారాలు ఉంటాయి. ఆరంజ్, పళ్లు , బఠాణి, బాదం , పుచ్చ కాయ, చిలగడదుంప , మెంతికూర, పాలకూర ఆకుకూరలు , చేపలు, అరటి, బ్రకోలీ, బీన్స్, కాయగూరలు, కొత్తిమీర, మాంసాహారాలు , మిరియాలు, మిరపకాయ లాంటి సుగంధ ద్రవ్యాలకు మంచి రేటింగ్ ఉంది.
వేల రకాల ఫుడ్స్ ఉన్నప్పటికి ఒక్క అన్నము తోనేనని అన్ని పదార్ధాలు కలిపి తినొచ్చని ఒక ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. చట్నీ , కూరలు, పెరుగు, పొడులు చారులు,కాల్చిన, వేపుడులు , వెన్న, నెయ్యి, పాలు , లాంటి రక రకాల వంటకాలతో కలుపుకునే తినేది ఒకే ఒక ప్రపంచపు ఆహారము అన్నమే అని పాతిక సంవత్సరాల క్రితమే చెప్పారు. అన్నము ఒక్కటే మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలదు. అలాగే, దీనికి కూడా వంద శాతం రేటింగ్ ఇవ్వొచ్చు.