Brain Health Tips
లైఫ్‌స్టైల్

Brain Health Tips: సూపర్ హ్యూమన్ గా మారాలా? అయితే ఇవి పాటించండి!

Brain Health Tips: మానవ శరీరంలో మెదడు అతి ముఖ్యమైనది. మన బ్రెయిన్ పనితీరుపైనే మనిషి ఎదుగుదల, ప్రవర్తన ఆధారపడి ఉంటుందని చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. మెదడు ఎంత చురుగ్గా ఉంటే అంత త్వరగా మన దయనందిన కార్యక్రమాలను చెకపెట్టవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మందిలో మెదడు పనితీరు మందగిస్తోంది. దీంతో ఏ పని చేయాలన్న ఆసక్తి, ఏకాగ్రత లోపిస్తోంది. నిరాశ, నిస్సత్తువలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. మైండ్ ను సూపర్ ఛార్జ్ చేసే కొన్ని టెక్నిక్స్ ను సూచిస్తున్నారు. అవి క్రమం తప్పకుండా పాటిస్తే మీ బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేసి సూపర్ హ్యూమన్స్ గా మారిపోతారని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరిపడినంత నిద్ర

బ్రెయిన్ కు బూస్టప్ ఇచ్చే వాటిలో నిద్ర అతి ముఖ్యమైంది. ఈ రోజుల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్ధరాత్రి దాటాక పడకోవడం.. ఆ మర్నాడే ఉద్యోగ పనుల రిత్యా త్వరగా లేచి ఆఫీసులకు వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. చాలి, చాలని నిద్ర వల్ల మెదడు పనితీరు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ 7- 8 గంటల నిద్ర ప్రతీ ఒక్కరికి తప్పనిసరని స్పష్టం చేస్తున్నారు. తద్వారా బ్రెయిన్ కు కావాల్సిన విశ్రాంతి దొరికి సూపర్ ఛార్జ్ అవుతుందని అంటున్నారు.

బ్రెయిన్ బూస్టింగ్ గేమ్స్

మెదడు పనితీరును మెరుగు పరిచే గేమ్స్ వల్ల బ్రెయిన్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సుడోకు, క్రాస్ వర్డ్, పజిల్స్ వంటి గేమ్స్ ఆడటం వల్ల బ్రెయిన్ యమా యాక్టివ్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వారిలో సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం పెంపొందుతున్నట్లు తెలియజేస్తున్నారు.

ప్రకృతిలో సమయాన్ని గడపడం

ప్రస్తుతం చాలా మంది జీవితాలు రోబోటిక్ గా మారిపోయాయి. జాబ్, వర్క్ అంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మందగిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  ప్రకృతిలో గడపడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు. పచ్చని చెట్ల మధ్య సమయాన్ని గడిపే వారు మానసికంగా చాలా ఆనందంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. తద్వారా వారి మెదళ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలిందని గుర్తు చేస్తున్నారు.

Also Read: Arindam Bagchi: అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశం.. ధీటుగా బదులిచ్చిన భారత్

యోగా చేయడం

నిత్యం యోగా చేయడం ద్వారా బ్రెయిన్ ను శక్తివంతంగా మార్చుకోవచ్చు. ఒత్తిడి నియంత్రించడానికి బలమైన సాధనంగా యోగా ఉపయోగపడుతుంది. రోజూ యోగా చేసేవారి బ్రెయిన్ ఉల్లాసంగా ఉంటూ చురుగ్గా పనిచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకునే స్కిల్స్ కూడా వారిలో గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.

స్నేహితులతో సరదాగా గడపడం

గంటల కొద్ది ఒంటరిగా గడిపేవారితో పోలిస్తే స్నేహితులతో సమయాన్ని గడిపే వారి బ్రెయిన్ ఎంతో చురుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోషలైజింగ్ వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా చాలా దృఢంగా తయారవుతున్నట్లు సూచిస్తున్నారు. రోజూ ఫ్రెండ్స్ ను కలవడం కుదరనివాళ్లు వారంతంలోనైనా తమకు ఇష్టమైన వారితో సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

స్క్రీన్ టైమ్ తగ్గించడం

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కొందరు గంటల తరబడి సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.  మెుబైల్ స్క్రీన్ ను అదే పనిగా చూడటం వల్ల బ్రెయిన్ పనితీరు దెబ్బతింటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారిలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు చెబుతున్నారు. ఫోన్ వినియోగాన్ని ఎంత వరకూ నియంత్రించగలిగితే మెదడుకు అంత మంచిదని స్పష్టం చేస్తున్నారు.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు