Breathing Issues: ఏదైనా అనారోగ్యంబారిన పడినా, ఇన్ఫెక్షన్ వల్ల కూడా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఎంతో అసౌకర్యానికి గురవుతారు. ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు ,అనారోగ్యం బారిన పడినప్పుడు, అధిక బరువు ఉన్నవారికి కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది. కానీ మరికొందరిలో మాత్రం ఎక్కువవుతుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలి. ఇక ఈ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. అల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోస వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
అందుకే ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు తగ్గుతాయి. అల్లం ముక్కలు నీటిలో వేసి దాంతో డికాషన్ తయారు చేసుకుని తాగితే ఇంకా మంచిది. నేరుగా అల్లం రసాన్ని కూడా తీసుకోవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల నాసికా రంధ్రాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు క్లియర్ అవుతాయి. ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగుపడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక గోడకు శరీరాన్ని ఆనించి నిలబడాలి చేతులను తొడలపై ఉంచాలి. భుజాలను వెనక్కి ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా కొద్దిసేపు ఉంటే శ్వాస సరిగా ఆడుతుంది.
నేలపై పద్మాసనంలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. నోటితో గాలిని పిలిచాలి. ఐదు సెకండ్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచాలి. పెదాలను మూసి ముక్కుతో నాలుగు సెకండ్ల పాటు శ్వాసను బయటకు వదలాలి. ఇలా రోజుకి 10 నుంచి 15 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కుర్చీలో కూర్చొని ఉండి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. కుర్చీలో కూర్చొని కాళ్ళను నెలకు ఆనించి ముందుకు వంగాలి. అనంతరం మోచేతులను మోకాళ్లపై ఉంచాలి. చేతులతో గడ్డం పట్టుకుని మెడను భుజాలను ముందుకు వంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా శ్వాసక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, లేదా శ్వాస ఆడకపోవడం, చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. శ్వాస సమస్యలు చిన్న కారణాల నుండి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల వరకు వివిధ రకాల కారణాల వల్ల సంభవించవచ్చు.
కారణాలు:
ఆస్తమా (ఉబ్బసం)
న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్)
బ్రోన్కైటిస్ (శ్వాసనాళాల వాపు)
సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)
ఊపిరితిత్తుల క్యాన్సర్
గుండె సంబంధిత సమస్యలు:
గుండె వైఫల్యం
గుండెపోటు
గుండె కవాటాల సమస్యలు
అలెర్జీలు:
పుప్పొడి, దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి అలెర్జీ కారకాలు
ఆహార అలెర్జీలు
మానసిక కారణాలు:
ఆందోళన, భయం, పానిక్ అటాక్స్
ఒత్తిడి
ఇతర కారణాలు:
రక్తహీనత
ఊబకాయం
పొగతాగడం
కాలుష్యం
ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడం
లక్షణాలు:
శ్వాస ఆడకపోవడం
దగ్గు
గురక
ఛాతి బిగుతు
శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం (వీజింగ్)
వేగంగా శ్వాస తీసుకోవడం
నీలం రంగులోకి మారిన పెదవులు లేదా గోర్లు (సైనోసిస్)
నివారణ:
ధూమపానం మానేయాలి: ధూమపానం శ్వాసకోశ సమస్యలకు ప్రధాన కారణం.
కాలుష్యం నుండి దూరంగా ఉండాలి: కాలుష్య ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి.
అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి: అలెర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి: పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి: వ్యాయామం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోవాలి: యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: శ్వాసకోశ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.
చికిత్స:
మందులు: ఆస్తమా, బ్రోన్కైటిస్ మరియు ఇతర శ్వాసకోశ సమస్యలకు ఇన్హేలర్లు, స్టెరాయిడ్లు మరియు ఇతర మందులు ఉపయోగపడతాయి.
ఆక్సిజన్ థెరపీ: తీవ్రమైన శ్వాస సమస్యలు ఉన్నవారికి ఆక్సిజన్ థెరపీ అవసరం కావచ్చు.
ఫిజియోథెరపీ: శ్వాసకోశ ఫిజియోథెరపీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శస్త్రచికిత్స: కొన్ని సందర్భాలలో, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
శ్వాస సమస్యలు తీవ్రమైనవిగా మారే అవకాశం ఉంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. స్వీయ వైద్యం చేయకూడదు.