Apple For Diabetics, apple
లైఫ్‌స్టైల్

Apple For Diabetics: మ‌ధుమేహులు ఆపిల్ తిన‌చ్చా?

Apple For Diabetics: ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు ఏయే ఆహారాలు తీసుకోవాలనే విషయంలో కాస్త అయోమయానికి గురవుతుంటారు. మామిడి, ద్రాక్ష, సపోటా, సీతాఫలం పండ్లను మధుమేహం ఉన్నవారు దూరంగా పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు కూడా శరీరంలోని ముఖ్య అవయవాలకు నష్టం చేకూరుస్తాయి. అందుకే మధుమేహం ఎక్కువ అయ్యేవరకు ఈ పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు. మధుమేహం స్త్రీ ,పురుషులు ఎవరికైనా రావచ్చు. రక్తప్రసరణంలో చక్కెర శాతం తక్కువ అయితే షుగర్ ఉన్నట్లు గుర్తిస్తారు.

ముఖ్యంగా షుగర్‌ను టైప్ 1, టైప్‌2 అని రెండు రకాలుగా వర్గీకరించారు. అంతేకాకుండా చిన్నపిల్లలు, గర్భిణులకు కూడా వచ్చే షుగర్‌ వస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు నిపుణులు పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. మధుమేహం వ్యాధితో గుడ్డితనం, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. షుగర్ వ్యాధిని నయం చేసుకోకపోతే ప్రమాదకర జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహం ముదరకముందే ముందుగానే గుర్తించి ఆహారం జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటంటే యాపిల్, బొప్పాయి.. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

Apple For Diabetics యాపిల్‌ చక్కెర స్థాయిలను పెంచేస్తుందని కంగారుపడుతూ ఉంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. యాపిల్లో విటమిన్ సి, ఫైబర్‌ ర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైగా రుచి కూడా బాగుంటుంది. కాబట్టి తీపి తినేందుకు భాగ్యం లేదని బాధపడేవారు యాపిల్ తినడం వల్ల ఆ కోరికను నెరవేర్చుకోవచ్చు. యాపిల్‌లో నీటి శాతం కూడా అధికంగానే ఉంటుంది. తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా యాపిల్‌లో క్యాలరీల శాతం కూడా తక్కువే. అయితే యాపిల్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని చాలామంది సందేహ పడతారు. కానీ యాపిల్‌లో ఉండే ఫైబర్ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్ ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఒక అద్భుతమైన ఫలం. ఇది ప్రతిరోజు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిని నిరంతరం అదుపులో ఉంచుతుంది. 100 గ్రాముల జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మితంగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు