Friday, July 5, 2024

Exclusive

National: రాజకీయ మేరునగ ధీరుడు

Legend of Indian politics P V Narasimharao birth annaversy on june 28 :
తెలంగాణ గడ్డపై పుట్టి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు పీవీ నరసింహారావు. అసాధారణ ప్రజ్ఞావంతుడైన నేతగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, కవిగా, రచయితగా, అనువాదకుడిగా, మేధావిగా, స్థిత ప్రజ్ఞుడిగా ఆయన కీర్తి గడించారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి వడివడిగా దేశాన్ని ముందుకు నడిపిన ధీశాలిగా పేరుగాంచారు. ఆయన సాహసోపేతమైన సంస్కరణల కారణంగానే నేడు భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిందనే విషయంలో ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండక్కరలేదు. ప్రధానిగా తన పాలనా కాలంలో ‘లుక్ ఈస్ట్’ పాలసీ ద్వారా భారత విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి, ఆసియా దేశాల్లో భారత్ పరపతి పెంచిన ఘనత పీవీదే. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ నేతలు, ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

దార్శనికుడు

దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్రవేశపెట్టిన దార్శనీకుడు పీవీ నరసింహారావు. పీవీ నాయ‌క‌త్వం, జ్ఞానం అమోఘం. ఈ ఏడాది ఆరంభంలో ఆయ‌న‌కు గౌర‌వం ఇస్తూ భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించడం గర్వకారణంగా ఉంది.
– నరేంద్ర మోదీ, భారత ప్రధాని

మార్గదర్శకుడు

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖ‌ల మంత్రిగా, ప్ర‌ధాన‌మంత్రిగా పీవీ చేసిన సేవ‌లు మ‌రువరానివి.
– రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం

స్ఫూర్తి ప్రదాత

విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేసిన మహోన్నతుడు పీవీ నరసింహరావు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం.
– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం

అభివృద్ధికి చిరునామా

తెలుగు వాళ్లు గర్వించే స్థాయిలో దేశాన్ని పాలించారు పీవీ. సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథాన నడిపారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి. సీఎంగా, కేంద్రమంత్రి, ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించారు.
– భట్టి విక్రమార్క, తెలంగాణ డిప్యూటీ సీఎం

తెలంగాణ కీర్తి

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పీవీ. భరత జాతి ముద్దుబిడ్డ. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేనిది. ఆయన సేవలు అజరామరం.
– మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

దేశం మరువని నేత

అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ. ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా ఆయన చరిత్రను దేశం ఎన్నడూ మర్చిపోదు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు.
– మాజీ మంత్రి కేటీఆర్

ఏం చేసినా తక్కువే!

పీవీ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇది చాలా అభినందనీయం. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతమైంది. కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. దేశ తెలుగు ప్రధాని అని నాన్నకి ప్రత్యేకత ఉంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా పరిపాలించారు. ఆయనకు ఎంత చేసినా తక్కువే. ఇంత గొప్ప మేధావి తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడం గర్వకారణం.
– సురభి వాణీదేవి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ

ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారు పీవీ. భూ సంస్కరణలు తీసుకువచ్చి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కూడా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. వాటిని ప్రతి ప్రభుత్వం పాటిస్తుంది. పీవీ సేవలను మోదీ సర్కార్ గుర్తించి భారత రత్న ఇచ్చింది. కాంగ్రెస్ పీవీని అవమానిస్తే, బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంది. బీజేపీ ఆయన సేవలను గుర్తించింది.
– ఎంవీ సుభాష్, పీవీ మనవడు, బీజేపీ నేత

పీవీ రచనలు చాలా గొప్పవి. రాజకీయాల్లో ఆయన సోషలిస్టుగా ఎదిగిన నేత. సీఎం అయినప్పుడు భూ సంస్కరణలు అమలు చేశారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వభావాలు మారిపోయాయి. రాజకీయాలు కొద్ది మందికే పరిమితం అన్న పరిస్థితి నుంచి అందరూ చేయవచ్చు అని చేసి చూపించారు. ప్రధానిగా ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయి.
– కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు

హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద పీవీ నరసింహారావు 103వ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కోదండరాం, హైకోర్టు జడ్జి శ్రావణ్ కుమార్ తదితరలు నివాళులర్పించారు. అసెంబ్లీలో పీవీ చిత్రపటానికి సభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి కేటీఆర్, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ భవన్‌లో పీవీ చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు వీ హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, భవాని రెడ్డి, రాపోలు జయ ప్రకాష్, ప్రేమలత అగర్వాల్, లింగం యాదవ్ తదితరులు నివాళులర్పించారు.

ఎంపీ నుంచి పీఎం వరకు ప్రస్థానం

పీవీ 1977లో హనుమకొండ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. 1978లో పబ్లిక్‌ అకౌంట్స్‌ ఛైర్మన్‌గా నియమితులైయ్యారు. 1980-84 వరకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1984లో కేంద్ర ప్రణాళిక మంత్రిగా, ఆ తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1985లో రక్షణ మంత్రిగా పనిచేశారు.1985-88 వరకు మానవ వనరుల శాఖమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు అప్పడే ప్రారంభమైంది. 1988లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.

ప్రధానిగా పీవీ

1989లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. అప్పుడు పీవీ క్రీయాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. రాజీవ్ ‌గాంధీ హత్య తర్వాత జరిగిన 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పీవీ పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు ఆయన అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 జూన్‌ 20 ప్రధానిగా పీవీ నర్సింహారావు ప్రమాణ స్వీకారం చేశారు.

ఢిల్లీ గద్దెపై తెలుగు పెద్ద

ఢిల్లీ గద్దెపై ప్రధానిగా తెలుగు పెద్ద కొలువయ్యారు. తొలిసారి తెలుగు వ్యక్తి ప్రధాని పదవి చేపట్టారు. అయితే 1991 సాధారణ ఎన్నికల్లో పీవీ పోటీ చేయలేదు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత 1991లోనే నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించారు. పీవీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు కొనసాగింది. 1996లో ఒడిశాలోని బరంపురం నుంచి ఎంపీగా పీవీ విజయం సాధించారు. పీవీ రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది. 1952 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన.. ప్రముఖ కమ్యూనిస్టునేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత 1957 నుంచి 1972 వరకు నాలుగు సార్లు మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖ పదవులు నిర్వహించారు.

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా!

1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అనంతరం జరిగిన పరిణామాలతో 1971 సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సామాజికవర్గ ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేకస్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం పీవిది. తనకంటూ ఒకవర్గం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్రరాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు పాములపర్తి వేంకట నర్సింహారావు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉన్నప్పటికీ.. సమర్థతవల్లే ఆనాడు పీవి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా పీవీ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...