Ponnam Prabhakar: జీఎస్టీ తో ప్రజలకు ఏం లాభం జరిగింది? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..గతంలో జీఎస్టీ ని ప్రజల నెత్తిపై రుద్ది, మళ్లీ 8 ఏళ్ల తర్వాత వాళ్లే సవరణలు చేసినట్లు గొప్పగా చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ఈ జీఎస్టీ విధానాల మార్పుల వలన తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదే అంటూ ఆయన వెల్లడించారు. 8 సంవత్సరాలుగా బీజేపీ ప్రజల రక్తాన్ని తాగిందని మండిపడ్డారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని తాము మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామన్నారు. పేదలను దోచుకోవడానికే జీఎస్టీ ని తెచ్చారన్నారు.
పెట్రోల్ ,డీజిల్ జీఎస్టీ లో చేర్చాలి
శవ పేటికలు, పసిపిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేయడం దారణమన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణ కు జరిగిన నష్టంపై బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదన్నారు. పెట్రోల్ ,డీజిల్ జీఎస్టీ లో చేర్చాలని తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని, కానీ ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేలేదన్నారు.జీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని చేశారన్నారు. ఇక తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అద్భుతంగా జరుగుతున్నాయని వివరించారు.
Also Read: Mallu Bhatti Vikramarka:ఈ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్.. 3,745 కోట్ల పెట్టుబడులు1,518 మందికి ఉపాధి
గల్ఫ్ బాధితుల కోసం కఠిన చట్టాలు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గల్ఫ్ బాధితుల కోసం త్వరలో కఠిన చట్టాలు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దుబాయ్, మస్కట్ లో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసే దిశగా చర్యలు సాగుతున్నాయన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఈసందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..దళారుల కట్టడి కోసం పకడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 2014 లో బతుకమ్మ వచ్చినట్లు రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ వాడుకుందన్నారు.ప్రజల బతుకమ్మ గా సీఎం రేవంత్, ప్రజా పాలనలో సంబరాలు జరుగుతున్నాయన్నారు. బతుకమ్మ తో అమ్మవారి ఆశీర్వాదం ప్రజలపై ఉండాలన్నారు. తీరొక్క పూలతో ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని వెల్లడించారు. బతుకమ్మ గిన్నిస్ రికార్డు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Also Read: 71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?