In The Grip Of Corona, Singapore Panics: 2019 డిసెంబర్‌లో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ప్రతిరోజూ కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దీని ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఈ మహమ్మారి మాత్రం కొత్త రకం రూపాలను మార్చుకుంటూ ప్రపంచ దేశాలపై తన పంజాను చూపిస్తోంది. తాజాగా మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సింగపూర్‌లో కరోనా కొత్త వేవ్ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 26వేల కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా తయారు అయ్యాయి. అంతేకాదు అక్కడ నివసిస్తోన్న ప్రజలు ఆందోళనకు గురిఅవుతున్నారు.
Also Read: రఫాని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో అమెరికా ఫైర్
మే 5 నుంచి 11వ తేదీ మధ్యలో 25వేల 900 కొత్త కేసులు నమోదయ్యాయని సింగపూర్ వైద్యారోగ్యశాఖ మంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న కేపీ.2 వేరియంట్ పట్ల ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని వైద్యారోగ్య సిబ్బందిని అలర్ట్ చేశారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే ఛాన్సులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారంలో 13వేల 700 కేసులు నమోదయ్యాయని తెలిపారు.