Election Code Violation: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై మూడు కేసులు నమోదయ్యాయి. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నాయకులు ప్రచారంతో నియోజకవర్గాన్ని హోరెత్తించారు. పోలింగ్ జరిగిన మంగళవారం రోజు ఆయా పార్టీల నాయకులు నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి తిరుగుతూ హల్ చల్ సృష్టించారు.
Also Read; Dhoni Viral Video: ఫ్యాన్ బైక్‌పై ధోనీ సంతకం.. 3 లక్షల బైక్ 30 కోట్లదైంది!
ఎన్నికల కోడ్ ఉల్లంఘన..
ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన(Election code violation)కు పాల్పడ్డ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య(Beerla Ilayya), రామచందర్ నాయక్(Ramachander Nayak), రాందాస్‌లపై మధురానగర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇక, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar), మెతుకు ఆనంద్(Methu Anand)లపై బోరబండ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. చెదురుమదురు ఘటనలు మినహా ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
Also Read: Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!
