Jubilee Hills By Election (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Jubilee Hills By Election: నేటితో ప్రచారం పరిసమాప్తం కానుండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టెన్షన్‎ ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని కొన్ని చోట్ల కొందరి చేత జూద క్రియకు తెరలేపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది రూపాయల బెట్టింగ్‌లు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(MLA Maganti Gopinath) అకాల మృతితో జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజార్టీపైనా, సెకండ్ ప్లేస్ పై నా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా రూ.50 లక్షల మేర పందేలు కాసారని ఫలితాలు వచ్చే నాటికి ఈ పందేలు రూ.1కోటికి చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

అంతటా జూబ్లీహిల్స్ టెన్షన్

నేటితో ప్రచారం పరిసమాప్తం కానుండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) టెన్షన్‎ ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని కొన్ని చోట్ల కొందరి చేత జూద క్రియకు తెరలేపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తెలుగు రాష్ట్రా రాజకీయాల్లో హీటెక్కించింది. ఇక్కడి కాంగ్రెస్ , బిఆర్ఎస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో వాలిపోయారు. ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా “సందడిలో సడేమియా” చందాన కాయ్ రాజా కాయ్ అంటూ కొందరు పందేలకు దిగుతున్నారు.

Also Read: Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు

పువ్వాడ జోక్యం… చర్చ నీయాంశం

మాగంటి గోపీనాథ్ కు చెందిన బినామీ ఆస్తుల కోసం కేటీఆర్(KTR) ఖమ్మానికి చెందిన మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar)ద్వారా మాగంటి మొదటి ఫ్యామిలీని బెదిరించి, పక్కాప్లాన్‌తో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి వారి జీవితాల్ని నాశనం చేసిండనే వార్తలు ఖమ్మం జిల్లాలో చర్చ నీయాంశమౌతున్నాయి. ఈమేరకు సాక్షాత్తు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కూడా ప్రస్తావించిన అంశాలు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ చెప్పినట్లు దివంగత మాగంటి గోపీనాథ్ కన్న తల్లి ఆవేదన కు అర్థం ఉందని అంటున్నారు. మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపణల మేరకు ఆయన హఠాత్తు మరణం పొందిన మిస్టరీ వీడాలి.. ఆయన మరణం చుట్టూ తలెత్తుతున్న అనుమానాలపై విచారణ జరపాలి, ఆయన ఆస్తి పంపకాలు, ఎవరి పేరున మారాయి, ఎవరికి దక్కాయి, ఎక్కడ చేతులు మారాయో స్పష్టం చేయాలి.. ఆయన కుమారుడు ఆరోపించినట్లు పువ్వాడ అజయ్ ఫోను బెదిరింపులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: Suri Gang Arrested: రౌడీ షీటర్ సూరి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Just In

01

BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’గా ఎవరో తెలుసా? టీజర్ విడుదల

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో