Commissioner Sudheer Babu:​ గ్లోబల్​ సమ్మిట్​‌కు భారీ బందోబస్తు
Commissioner Sudheer Babu (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Commissioner Sudheer Babu: తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​‌కు భారీ బందోబస్తు.. మూడంచెల భద్రత

Commissioner Sudheer Babu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్‌(Telangana Rising Global Summit)కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సమ్మిట్ జరగనున్న ప్రాంతంలో వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 2,500 మంది పోలీసులు బందోబస్తు చేయనున్నారు. రాచకొండ కమిషనర్​ సుధీర్ బాబు శుక్రవారం దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ఐసీసీ ఎండీ శశాంక్​, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్​ వర్క్స్​ ఎండీ అశోక్ రెడ్డితోపాటు వేర్వేరు విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా

డిసెంబర్ 8, 9వ తేదీల్లో మహేశ్వరం మీర్​ ఖాన్​ పేటలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​ జరుగనున్నది. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్​‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో లా అండ్​ ఆర్డర్, ట్రాఫిక్​(Traffic), స్పెషల్ బ్రాంచ్​, ఇంటెలిజెన్స్​, ఆక్టోపస్​, గ్రేహౌండ్స్​, డాగ్​ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై సమన్వయ సమావేశంలో చర్చించారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారన్న వివరాలను తెలుసుకున్నారు. కావాల్సిన సహకారం గురించి తెలియచేశారు. ఇక, బ్యారక్స్, మెస్​, కిచెన్​, మరుగు దొడ్లు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. సమ్మిట్​‌కు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, బహుళ సంస్థల అధినేతలు, దేశీయ సంస్థల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు కలిపి 600 మంది వరకు రావొచ్చని అధికారులు చెప్పారు. వీరి సహాయక సిబ్బంది దాదాపు 3 వేల మంది రానున్నట్టు తెలిపారు.

Also Read: Cold Wave: స్వెటర్లు రెడీ చేసుకోండి.. తెలంగాణ వాసులను గజగజ వణికించబోతున్న చలి.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

మూడంచెల భద్రత

ఇక, విఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. సమ్మిట్ జరిగే ప్రాంతంలో నిఘా కోసం అడుగడుగునా వెయ్యికి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇవన్నీ సెంట్రల్ పోలీస్ కంట్రోల్​ రూంకు అనుసంధానమై ఉంటాయని చెప్పారు. ట్రాఫిక్​ క్రమబద్దీకరణ కోసం వెయ్యి మందికి పైగా పోలీసులను నియమించనున్నట్టు తెలిపారు. వాహనాల మళ్లింపు, రూట్​ మ్యాపులు, బారికేడ్ల ఏర్పాటు, పార్కింగ్​ నిర్వహణ ఓసం ట్రాఫిక్​ మార్షల్స్ సేవలను వినియోగించుకోనున్నట్టు చెప్పారు. ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా ఆయా మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ ప్రజలు, వాహనదారులు సమ్మిట్​ జరిగే రెండు రోజులపాటు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వక్తలు, పెట్టుబడిదారుల భద్రత కోసం ఉమెన్స్ వింగ్​, షీ టీమ్స్​ సిబ్బంది ఉంటారని చెప్పారు.

Also Read: Balakrishna: ‘నన్నే అంటి పెట్టుకున్నారు’.. బాలయ్య భార్య మాటలు హరికృష్ణను ఉద్దేశించా.. లేక?

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు