Maganti Sunitha: ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తూ కాంగ్రెస్(Congress) నేతలు ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీఆర్ఎస్(BRS) జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)ఆరోపించారు. కృష్ణానగర్ పోలింగ్ బూత్(Krishnanagar polling booth) వద్ద మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి భైఠాయించారు. కృష్ణా నగర్‌లో ఇష్టానుసారంగా రిగ్గింగ్(Rigging) జరిగిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి ఓటు వేయకపోతే రేపటి నుంచి బయట తిరగనివ్వం అని హెచ్చరించారన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా..
తాను ఎటు వెళ్లిన తన వెనుక వంద మంది వస్తున్నారని మహిళపై ఇంత అరచకమా? రౌడీ షీటర్లు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు జెన్యున్‌గా ఉండాలని, బిర్యానీలో డబ్బులు పెట్టి పంచారన్నారు. రాష్ట్రంలో ఆకు రౌడీలను తీసుకొని వచ్చి పెట్టుకున్నారని, 14 తరువాత ఒక్కొక్కరి పని చెబుతానని హెచ్చరించారు. సురేష్ యాదవ్(Suresh Yadav) మహిళ అని చూడకుండా తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerla Ailayya), ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు.
Also Read: Neutral Voters: తటస్థ ఓటర్లపై అన్ని పార్టీల దృష్టి.. అందరి చూపు అటువైపే..!
దౌర్జన్యం చూస్తున్నా..
నిన్నటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో ఉన్నారని, ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నదని నిలదీశారు. తననే భయ పెట్టాలని చూస్తున్నారని, ఎంత మందిని అని అపుతాం అన్నారు. కాంగ్రెస్‌కు అంత రౌడీయిజం చేయాల్సినఅవసరం ఏంటి? మొదటి సారి ఇలాంటి దౌర్జన్యం చూస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read; GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం
