Turmeric Farmers Slams Dharmapuri Arvind Nizamabad
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Jagtial: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

– అరవింద్ మరీ ఓవర్‌గా మాట్లాడుతున్నారు
– సొంత పార్టీ వాళ్లే ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు
– దేవుడి పేరు చెప్పి ఓట్లు రాబట్టాలనుకుంటున్నారు
– కానీ, ఈసారి ప్రజలు క్లారిటీతో ఉన్నారు
– మేం తలుపులు తెరిస్తే బీజేపీలో ఎవరూ ఉండరు
– కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం
– ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
– నేడు నిజామాబాద్‌లో సీఎం పర్యటన


Turmeric Farmers Slams Dharmapuri Arvind Nizamabad: పసుపు రైతుల్ని ఎంపీ అరవింద్ మోసం చేశారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిది మూర్ఖపు వాదన అంటూ ఫైరయ్యారు. అరవింద్ మాయ మాటలు నమ్మొద్దని, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అని తెలుసుకునే ఆయన బయపడుతున్నారని ఎద్దేవ చేశారు. అరవింద్ ఐదేళ్లు ఎంపీగా ఉండి చేసిందేమీ లేదన్నారు.

పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించలేదని చెప్పారు. బీజేపీ వాళ్లే అరవింద్‌పై తిరగబడ్డారని, టికెట్ ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేవుని పేరు చెప్పి జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయని అనుకుంటున్నారేమో ప్రజలు అంతా తెలుసుకొని ఆలోచించే ఓట్లు వేస్తారని చెప్పారు లక్ష్మణ్ కుమార్. ధర్మపురిలో కాంగ్రెస్ తలుపులు తెరిస్తే బీజేపీలో కార్యకర్తలు కూడా మిగలరు అంటూ హెచ్చరించారు. అరవింద్ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని అంటున్నారని మండిపడ్డారు.


Also Read:బినామీ డ్రామా @ జన్వాడ

జాతీయ పార్టీలో ఉన్న అరవింద్ జగిత్యాల తాటిపర్తి జీవన్ రెడ్డిని ఆర్మూర్ జీవన్ రెడ్డి అంటూ మాట్లాడటం ఆయన ఎంత భయంలో ఉన్నారనేది స్పష్టమవుతోందని చురకలంటించారు. మరోవైపు, జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ పాత కలెక్టర్ బంగ్లా గ్రౌండ్‌లో ఇవాళ జరిగే సీఎం బహిరంగ సభ వివరాలు వెల్లడించారు. తన నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్టు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలు కష్టాలు పడ్డారని చెప్పారు. నిజామాబాద్‌లో ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్నారు జీవన్ రెడ్డి.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు