Wednesday, October 9, 2024

Exclusive

Drama: బినామీ డ్రామా @ జన్వాడ

– కేటీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ బినామీ లీలలు
– దండు రాజేష్ రాజ్‌తో కలిసి రాజభోగాలు
– బుద్వేల్ ప్రదీప్ రెడ్డితో ఇల్లీగల్ రియల్ బిజినెస్
– గేదల వెంకట సూర్యకిరణ్‌‌తో కుటుంబ, వ్యాపార హెల్త్ కేర్ సర్వీస్
– అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలు ఎన్నో?
– ఎన్జీటీ కేసు స్టే కోసం హైకోర్టునే తప్పుదారి పట్టించిన ఘనులు
– జన్వాడ ఫామ్‌హౌజ్ బినామీలపై నిగ్గు తేల్చిన ‘స్వేచ్ఛ’- బిగ్ టీవీ
– ఒక్కటి తవ్వితేనే ఇంతలా ఉంటే.. మిగితా బినామీ బాగోతాలు ఇంకెన్నో!
– హైటెక్ లెవల్‌లో అంతా నడిపించిన మాజీ మంత్రి
– గులాబీ.. బినామీ.. సునామీ పార్ట్ -2

Binami Drama, Who Is King Of Janwada Farm House: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ గులాబీ నేతలు ఆడిందే ఆటగా సాగింది. అంతకుముందు వరకు సైకిళ్లు, స్కూటర్లపై తిరిగిన వాళ్లు కొన్నాళ్లకే బెంజ్ రేంజ్‌కి వచ్చేశారు. అక్రమ దారుల్లో కోట్లకు పడగలెత్తారు. ఆ బాగోతాలన్నింటినీ ‘‘గులాబీ.. బినామీ.. సునామీ’’ పేరుతో ‘స్వేచ్ఛ’-బిగ్ టీవీ వరుస కథనాలు ఇస్తోంది. తాజాగా బినామీ వ్యవస్థ ఎలా ఉంటుందో కేటీఆర్ ఫామ్‌హౌజ్ కథనంతో కళ్లకు కట్టినట్టు చూపించింది.

బావ అలా.. బామ్మర్ది ఇలా..!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి, బావ హరీష్ రావు తన జిల్లాలో మండలానికో ఫామ్‌హౌజ్‌ బినామీల రూపంలో కట్టుకుంటే, మాజీ మంత్రి, బామ్మర్ది కేటీఆర్ జన్వాడ వద్ద జబర్దస్‌గా బినామీల మాటున నిర్మాణాలు చేపట్టారు. ఇది ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు బిగ్ టీవీ వివరించింది. ఎక్కడ మొదలైంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో వివరించింది. ఈ క్రమంలో బినామీ సునామీలో ఎంతో కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి. 111 జీవోలోని భూములు తమ జాగీరు అన్నట్టుగా భూ దందాలు చేశారు. అదేంటని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. హైకోర్టులో పిటిషన్‌లోనూ తప్పుడు సమాచారం ఇచ్చి తాము చేసేదంతా రైట్ అన్నట్టుగా వ్యవహరించారు. దండు రాజేష్, బుద్వేల్ ప్రదీప్ రెడ్డి, వెంకట సూర్య కిరణ్ ఎలా బినామీలుగా మారారో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. రాస్తే ఇదో క్రైమ్ మహా కావ్యం అవుతుంది. తీస్తే బ్లాక్ బస్టర్ సినిమాగా మారుతుంది.

Also Read:బీఆర్‌ఎస్, బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్..

దండు రాజేష్ రాజ్.. మామూలోడు కాదు!

ఇతగాడు క్లియరెన్స్ ఇస్తేనే ఇతర దేశాలకు మాజీ మంత్రి ప్రయాణం చేస్తారని టాక్. పార్టీలు అరెంజ్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన దండు రాజేష్ రాజ్ వందల ఎకరాల్లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్స్‌ని ప్రారంభించాడని సమాచారం. ఈయన వెనుక నుంచి జరిపించే కథలు పుంకానుపుంకాలుగా రాయొచ్చు.

బుద్వేల్ ప్రదీప్ రెడ్డి.. యమ ఖతర్నాక్!

ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ ఓనర్ ప్రదీప్ రెడ్డి. పేరుకి జన్వాడ ఫామ్‌హౌజ్ ఓనర్. ఇది పక్కాగా ఇల్లీగల్ నిర్మాణం. కానీ, అందులో ఉండేది మాత్రం కేటీఆర్ కుటుంబం. అందుకు ప్రదీప్‌కి అనేక చోట్ల రియల్ ఎస్టేట్ క్లియరెన్స్‌లు ప్రతిఫలంగా అందాయి. మచ్చుకగా సోమాజిగూడలో యూఎల్సీ ల్యాండ్ మాజీ మేయర్‌తో కలిసి బెదిరించి క్లియర్ చేసుకున్నారు. ఈ ఫామ్‌హౌజ్ లీజ్‌కి ఇచ్చి ప్రభుత్వంతో అనేక పనులు చేయించుకున్నాడు ప్రదీప్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సాగిన ఇతని ప్రయాణం ఏంటో త్వరలోనే బట్టబయలు కానుంది.

గేదల వెంకట సూర్యకిరణ్.. నగదు మళ్లింపులో కింగ్!

ఈయనకు కేటీఆర్ భార్యతోనే వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇందుకు పెద్ద మొత్తంలో సొత్తు బదిలీలు అయి ఎక్కువ రేట్స్‌కి షేర్స్ అమ్ముకొని కంపెనీలను క్లోజ్ చేసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. సూర్యకిరణ్ సొదరుడు రాము గేదల ఓ యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. దానికి ప్రభుత్వం నుంచి భారీగా యాడ్స్ వెళ్తాయి. సద్గుర్ హెల్త్ కేర్, ఓయాసిస్ ఫెటిలిటి సెంటర్స్ నుంచి భారీగా నిధులు భూముల కోసం మళ్లిస్తారు. కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. అప్పటి మంత్రి కేటీఆర్ అండదండలతో ఎన్నో లాభాలు పొంది ఫామ్‌హౌజ్ వద్ద భూములు కొన్నారని అంటున్నారు. మొత్తం ఎంత భూమిలో ఫామ్‌హౌజ్ ఉంది. ఎంత భూమి వీరికి ఉందో ఉమ్మడి ఫామ్‌హౌజ్ ఏపీ బిజినెస్ మెన్స్‌తో కలిసి ఎలా నిర్మించుకున్నారో ‘స్వేచ్ఛ’- బిగ్ టీవీ కథనాలు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Also Read:ట్యాంపరింగ్‌,ఈవీఎంల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నలు.!

ఇదొక్కటే కాదు అన్నిట్లోనూ అంతే!

పదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, భారీ అవినీతి జరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎంత మేలు చేసి ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నారో ‘గులాబీ.. బినామీ.. సునామీ.. పార్ట్ -3’’ లో చూద్దాం.

ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్న జన్వాడలోని సర్వే నెంబర్ 311లో అక్రమంగా కేటీఆర్ ఫామ్‌హౌజ్ నిర్మించారంటూ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు రేవంత్‌ రెడ్డి. దానిపై నిజానిజాలు తేల్చడానికి ఎన్జీటీ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌. తనకు ఆ ఫామ్‌హౌజ్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ రిట్‌ పిటిషన్ వేశారు. అంతేకాదు, ఆ ఫామ్‌హౌజ్ నాదంటూ బద్వేల్ ప్రదీప్‌ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశాడు. 2014లో 111 జీవో నిబంధనలకు లోబడి, పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని ఆ భవనాన్ని కట్టారని, దాన్నే తాము కొనుగోలు చేశామన్నాడు. ఒకవేళ అభ్యంతరాలుంటే పర్మిషన్ తీసుకున్న ఆర్నెళ్లలోనే చెప్పాలి తప్ప, ఇప్పుడు అక్రమమని చెప్పడం కరెక్ట్ కాదంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అసలు ఓనరే కాని కేటీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారంటూ ఆయన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. వీళ్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్ నవీన్‌ రావు ధర్మాసనం ఎన్జీటీకి ఈ కేసులో జోక్యం చేసుకునే అధికారం లేదంటూ తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయ్యింది. అయితే, 2020లో బాల్క సుమన్ చెప్పిన మాటలను బట్టి, నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ ఆ ఫామ్‌హౌజ్‌ను లీజ్‌కు తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఇక రేవంత్‌ రెడ్డిపై నార్సింగి పోలీసులు పెట్టిన కేసులోనూ కేటీఆర్ అక్కడ ఉంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి కేటీఆర్ తనకు సంబంధం లేదంటూ కోర్టుకు చెప్పిన మాట అవాస్తవం. ఆయన దాన్ని లీజుకు తీసుకుని ఉంటున్నానన్న విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచి పెట్టారు. వాస్తవానికి ఈ భూములు సత్యం రామలింగరాజు కుటుంబానివి. సత్యం స్కామ్ తర్వాత ఐటీ ఆధీనంలోకి వెళ్లాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక, జన్వాడలోని భూములు ఐటీ డిపార్ట్‌మెంట్‌ సీజ్‌లో ఉన్నప్పటికీ, సర్వే నెంబర్ 311లో ఫామ్‌హౌజ్ నిర్మాణం మొదలయ్యింది. జన్వాడ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారమే గ్రామపంచాయతీకి లేదు.. ఎందుకంటే అది ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలోని ప్రాంతం. అక్కడ కాంక్రీట్ నిర్మాణాలేవీ చేయకూడదు.

కేటీఆర్ ఈ ఫామ్ హౌజ్ లో ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ ఫామ్ హౌజ్ వెనుకే ఉన్న సర్వే నెంబర్ 301లో ఆయన భార్య శైలిమ భూమిని కొనుగోలు చేశారు. అక్కడ పండ్ల తోటను వేశారు. ఆ భూమిలోకి వెళ్లాలంటే, ఫామ్ హౌజ్ కు వెళ్లే గేటులో నుంచే వెళ్లాలి. అంతేకాదు శంకర్ పల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కూడా శైలిమ భూమి మీదుగా ఫామ్ హౌజ్ కు ప్రత్యేకంగా మరో రోడ్ ను నిర్మించారు. ఓవరాల్‌గా చూస్తే ఈ రెండు గేట్ల మధ్య ఉన్న స్థలం అంతా రకరకాల పేర్ల మీద ఉన్నా, అక్కడ వేసిన రోడ్లు, సెటప్‌ను చూస్తే మాత్రం కంట్రోల్ అంతా ఒక్కరిదే అని స్పష్టంగా అర్థమైపోతుంది. అక్కడితో అయిపోలేదు, ఫామ్ హౌజ్ నుంచి మరో వైపున ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌కు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువైపునుంచి వచ్చినా ఫామ్ హౌజ్ కు వెళ్లొచ్చన్నమాట.

1. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూముల్లో ఫామ్‌హౌజ్‌ను అక్రమంగా నిర్మించారు
2. ఫామ్‌హౌజ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
3. ఫామ్‌హౌజ్ విషయంలో హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారు.
4. ట్రిపుల్‌ వన్ జీవోకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి
5. ఫామ్‌హౌజ్ ఎవరు కట్టినా, ఎవరు కొన్నా, దాన్ని అనుభవిస్తోంది మాత్రం కేటీఆర్ కుటుంబమే.
6. ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్ ఉండడం, ఆయన సన్నిహితులే ఫామ్‌హౌజ్‌ను, చుట్టూ ఉన్న భూములు కొనుగోలు చేయడం చూస్తే బినామీ లావాదేవీలే అన్న అనుమానాలు కలుగుతున్నాయి

సో.. ఓవరాల్‌గా కేటీఆర్ ఉంటున్న ఫామ్‌హౌజ్ పూర్తిగా అక్రమ నిర్మాణమే అని అర్థమైపోతోంది. మరి ఈ ఫామ్‌హౌజ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? ట్రిపుల్‌ వన్ జీవో ను ఇప్పటికైనా సమర్థవంతంగా అమలు చేస్తుందా..? దీనికే ఇప్పుడు సమాధానం కావాలి.

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (సీనియర్ జర్నలిస్ట్)

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...