Swetcha Effect: నర్సింగ్ స్కూళ్లపై డీఎంఈ అధికారుల దాడులు!
Swetcha Effect (imagecredit:swetcha)
Telangana News, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దెబ్బకు నర్సింగ్ స్కూళ్లపై ఏకకాలంలో డీఎంఈ అధికారుల దాడులు!

Swetcha Effect: ‘స్వేచ్ఛ’ కథనం సృష్టించిన సంచలనం ఇది! కేవలం సంపాదనే లక్ష్యంగా, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ అడ్డగోలుగా సాగుతున్న నర్సింగ్ స్కూళ్ల దందాపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురించిన కథనం ‘నర్సింగ్ స్కూల్స్‌లో దందా’ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్య వ్యవస్థలు పనిచేయకపోవడం, కేవలం నగదు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకోవడంపై పెరిగిన ఆపవాదనలు, విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఫిర్యాదులు తీవ్రత సంతరించుకున్నాయి. క్రైస్తవ జన సమితి అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డీఎంఈకి చేసిన ఫిర్యాదును, దాని ఆధారంగా ‘స్వేచ్ఛ’ వెలువరించిన కథనాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(Director of Medical Education (DME) అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ఫలితంగా, రాష్ట్రంలోని నర్సింగ్ స్కూళ్ల నిర్వహణపై ఏకకాలంలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు.


23 స్కూళ్లపై మెరుపుదాడులు

‘స్వేచ్ఛ’ కథనంపై స్పందించిన డీఎంఈ అధికారులు వెంటనే రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. రాష్ట్రంలోని హైదరాబాద్(Hyderabada), రంగారెడ్డి(rangareddy), మేడ్చల్(Medchal), నల్లగొండ(Nalgonda) జిల్లాల్లో నిర్వహిస్తున్న 23 నర్సింగ్ స్కూళ్లపై 46 మంది ఆఫీసర్లు వేర్వేరు బృందాలుగా విడిపోయి మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పది మంది బృందాలతో నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో నర్సింగ్ స్కూళ్ల యాజమాన్యం చేస్తున్న అక్రమాల బాగోతం పూర్తిగా బయటపడింది. తనిఖీల్లో అధికారులకు విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. పలు స్కూళ్లు డీఎంఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా, ఇష్టానుసారంగా నడుస్తున్నాయి.


ముఖ్యంగా, ఒకే క్యాంపస్‌లో ఏకంగా నాలుగుకు మించి స్కూళ్లను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు ఉన్న చోట కాకుండా, కేవలం ఫీజులు వసూలు చేసుకోవడం లక్ష్యంగా, మరోచోట తరగతులు నడిపిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. ఉదాహరణకు, నల్లగొండలో అనుమతి పొందిన ఓ నర్సింగ్ స్కూల్, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం శారదా నగర్ కాలనీలోని ఓ భవనంలో నాలుగు స్కూళ్లు నడిపిస్తున్నట్లు తేలింది. అంతేకాదు స్టాఫ్, సౌకర్యాలు, అనుబంధ ఆసుపత్రులు వంటి కనీస వసతులు లేకుండానే అనేక సంస్థలు నడుస్తున్నట్లు టీమ్స్ గుర్తించాయి. డీఎంఈ డైరెక్షన్‌లో నర్సింగ్ స్కూల్స్ పనిచేసిన దాఖలాలే లేవని అధికారులు నిర్ధారించారు.

Also Read: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు

మర్యాదలతో మభ్యపెట్టే ప్రయత్నం

తనిఖీల్లో నల్లగొండ జిల్లాలోని కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులను మభ్యపెట్టేందుకు ఏకంగా భోజన సదుపాయంతో పాటు రకరకాల మర్యాదలు చేసినట్లు వినిపిస్తుంది. ఈ విషయాన్ని అక్కడ ఉన్న కొంత మంది విద్యార్థి సంఘాల నాయకులు డీఎంఈ దృష్టికి తీసుకెళ్లడంతో, ఉన్నతాధికారులు మరింత సీరియస్‌గా స్పందించారు. వెంటనే ఆయా స్కూళ్లలో తిరిగి తనిఖీలు నిర్వహించి, వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మరోసారి తనిఖీలు చేపట్టగా, అక్రమాలు ధృవీకరణ అయ్యాయి.

కఠిన చర్యలు..

అక్రమ పద్ధతిలో స్కూళ్లు నడవడానికి, నిబంధనలు ఉల్లంఘించడానికి చేతులు కలిపిన సంబంధిత అధికారులపైనా డీఎంఈ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘కాసులు ఇచ్చుకో.. కంపెనీ నడిపించుకో’ అన్న చందంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు డీఎంఈ సిద్ధమైనంది. కేవలం చదువు పూర్తి చేసినందుకు నగదు తీసుకోవడం, పరీక్షలు రాసేందుకు మరో వ్యక్తితో రాయించడం లాంటి తప్పుడు విధానాలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన నర్సింగ్ స్కూల్స్‌తో వ్యాపారం చేసిన, చేయించిన వారిపై తగిన స్థాయిలో చర్యలు తీసుకోవాలని డీఎంఈ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన విద్యను పేద, దళిత విద్యార్థులకు అందజేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దృష్టి సారించాలనే ఆవేదన వ్యక్తం అవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ అక్రమ నర్సింగ్ దందాపై ‘స్వేచ్ఛ’ కథనాలకు కేవలం రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

Also Read: Trump On India: భారత్‌పై ట్రంప్ ప్రశంసలు.. ఖంగుతిన్న పాక్ ప్రధాని.. ఏం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..