Telangana Jumping Politics
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Parliament Elections : కాంగ్రెస్ ఖిల్లాలో గెలుపుకై వ్యూహాలు..!

Strategies To Win In The Congress Fortress : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజక వర్గం.. జహీరాబాద్. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని శాసన సభా స్థానాలైన బాన్సువాడ, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కామారెడ్డిలో బీజేపీ, మిగిలిన నాలుగు స్థానాలైన జుక్కల్, నారాయణ్ ఖేడ్, ఎల్లారెడ్డి, ఆందోల్ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ పార్లమెంటరీ నియోజక వర్గంలో 14,45,246 లక్షల ఓటర్లున్నారు.


ఈ నియోజక వర్గానికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నాటి బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలుపొందారు. 2014లో గులాబీ పార్టీ అభ్యర్థి భీమ్‌రావు బస్వంత్‌రావు పాటిల్‌ (బీబీ పాటిల్), సురేష్ షెట్కార్ మీద విజయం సాధించారు. 2019 నాటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాటి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు కేవలం 6,229 ఓట్లతో గెలిచారు. తాజాగా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గులాబీ పార్టీకి బైబై చెప్పి, బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్ సాధించి బరిలో నిలిచారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ స్థానం కోసం DCMS చైర్మన్ శివకుమార్, మాజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి పేరునూ పార్టీ పరిశీలిస్తోంది. తాజాగా ఈ జాబితాలో గాలి అనిల్ కుమార్ పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల్లో బీబీ పాటిల్, సురేష్ షెట్కార్ ఇద్దరూ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఈ నియోజకవర్గంలోని రెండున్నర లక్షల మున్నూరు కాపు ఓట్లను పొందేందుకు బీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్ పేరును పరిశీలిస్తోంది.

Read More: బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగా సమితి


ఈ లోక్‌సభ స్థానంలో చెరుకు రైతుల సమస్యలు, సింగూరు జలాశయపు నీటి వ్యవహారం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అలాగే, ఈ నియోజకవర్గాలన్నీ కూడా సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలోనివే కావడంతో సాగునీటి అంశం కూడా ప్రధాన ప్రచారాంశం కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలోని జుక్కల్‌లో 1152, ఎల్లారెడ్డిలో 24001, నారాయణ ఖేడ్‌లో 6547, ఆందోల్‌లో 28,193 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, జహీరాబాద్‌లో 12,790, బాన్స్‌వాడలో 23,464 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక.. ఏడవ సీటైన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి 6,741 ఓట్లతో గెలుపొందారు. ఈ ఫలితాల ప్రకారం మొత్తంగా ఈ సీటులో కాంగ్రెస్ మెజారిటీలో ఉంది.

మరోవైపు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్ రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీనికి తోడు అటు కేంద్రంలోని మోదీ సర్కారు సైతం ఈ ప్రాంతానికి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వని పరిస్థితి. దీంతో ఈసారి ఇక్కడ బీజేపీకి అభ్యర్థి మైనస్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు భిన్నంగా ఈ ప్రాంతమంతా అనాదిగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ పార్లమెంటు సీటు పరిధిలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం సుమారు 18 శాతం ఎస్సీలు, 8 శాతం ఎస్టీలు, 12 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికి తోడు వ్యక్తిగతంగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌కు పార్టీలకు అతీతంగా ఉన్న సత్సంబంధాలు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రచార అస్త్రాలుగా నిలవనున్నాయి.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం