Monday, July 22, 2024

Exclusive

BRS Means : బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగా సమితి

BRS means Billa Ranga Samiti : పదేళ్లలో దొంగ హామీలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ జరిగింది. ఇందులో పాల్గొని ప్రసంగించారు సీఎం. 18 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలబడి పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. తనతో రక్త సంబంధం లేకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం వాళ్ల రక్తాన్ని చెమటగా మార్చి పని చేశారని కొనియాడారు. భద్రాద్రి శ్రీరాముడి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించుకున్నామని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు.

ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి బీఆరెస్ ను నమ్మలేదన్న రేవంత్, జనం చైతన్యంతో కాంగ్రెస్‌ను గెలిపించి బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని విమర్శించారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో రూ.500 లకే సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. మీ కళ్లల్లో వెలుగులు. గుండెల్లో ఆనందం చూడాలని జీరో బిల్లులు జారీ చేసాం. పదేళ్లలో మీకెవరికైనా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇచ్చారా? నేను మంచి చేస్తుంటే చూసి ఓర్వలేక తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతురు శాపనార్థాలు పెడుతుండ్రు. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటూ మనకు నీతులు చెబుతున్నారు. పదేళ్లయినా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సిగ్గులేని కేటీఆర్ ఏనాడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఇంటికెళ్లి మీ అయ్యను అడిగావా?90 రోజుల్లోనే గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నాం. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాం. పేడ మూతి బోడిలింగానికి నేను చెబుతున్నా.. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి. మీరంతా తొడుదొంగలు. రాష్ట్రాన్ని కొల్లగొట్టిన దోపిడీ దొంగలు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read More: ప్రణీత్ రావు ట్యాప్ చేసిన నెంబర్లు ఇవే.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకు తాగు నీరు లేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు సీఎం. వీళ్లా తమ గురించి మాట్లాడేదంటూ ఫైరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని, బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన 4 సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించ లేదని గుర్తు చేశారు. వీళ్ల అవగాహన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘ఖమ్మం జిల్లాలో నామాను ఎందుకు ప్రకటించ లేదు? మీ పార్టీకి దిక్కులేదా? పక్కనే సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను ఎందుకు ప్రకటించలేదు? ఆమెకు టికెట్ ఇవ్వరా? కేసీఆర్, హరీష్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకడం లేదా? నిజామాబాద్‌లో మీ బిడ్డకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలు మళ్లీ బండకేసి కొడతారని అనుమానమా? సికింద్రాబాద్‌లో గతంలో పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు? కలిసి కనిపిస్తే ప్రజలు చెప్పుతో కొడతారని బీజేపీతో చీకట్లో ఒప్పందం చేసుకుని.. మోడీ, కేడీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తుండ్రు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందనే కలిసి కుట్రలు చేస్తున్నారు.

ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతదని బీజేపీ లక్ష్మణ్ రోజుకోసారి అంటుండు. డాక్టర్ లక్ష్మణ్‌ను నేను ప్రశ్నిస్తున్నా. మీకు ఉన్న ఎనిమిది సీట్లతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఐదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉండాలని నన్ను కలిసి చెప్పి పోతుండ్రు. కేసీఆర్, మేం తలచుకుంటే, గేట్లు తెరిస్తే నీ ఇంట్లో వాళ్లు తప్ప అంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని మాకు అండగా నిలబడతారు’’ అంటూ హెచ్చరించారు రేవంత్. తాము రాజనీతిని పాటించాలనుకుంటున్నామని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేడీ కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మాతో గోక్కోవద్దు, గోక్కునోళ్లు ఎవరూ బాగుపడలేదని చురకలంటించారు. ‘‘మా కార్యకర్తలు చేసే చప్పుడుకు మీ గుండెలు అదురుతాయ్ బిడ్డా, ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నాకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ఎవ్వడు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతం. మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్‌ను లక్ష 50 వేల మెజార్టీతో గెలిపించండని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

 

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...