Saturday, May 18, 2024

Exclusive

Telangana Politics : ప్రణీత్ రావు ట్యాప్ చేసిన నెంబర్లు ఇవే.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Telangana Politics : ఎంతో పవిత్రమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను సొంత రాజకీయాలకు వాడుకుని భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ సర్కార్. అందుకు ప్రణీత్ రావును అడ్డు పెట్టుకుని ఇద్దరి మంత్రులకు అప్ డేట్ అందించాయి మీడియా యాజమాన్యాలు. కాంగ్రెస్‌లో ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసి కనీసం కార్యకర్తలకు కూడా పంపకుండా అడ్డు వేశారు. రేవంత్ రెడ్డి అనుచరులను గుర్తించి వారి ఫోన్స్‌లో ఎలాంటి సంబాషణ జరిగినా ఇట్లే తెలుసుకుని టాస్క్ ఫోర్స్‌తో రెయిడ్స్ చేయించారు. జిల్లాలకు వెళ్తే అక్కడ పట్టుకునేలా పోలీసులను అప్రమత్తం చేశారు. టోల్ గేట్ యాజమాన్యాలను ముప్పు తిప్పలు పెట్టి వాహనాలను ఆపించేవారు. ఇలా ఎన్నో దందాలు చేసిన రావుల బ్యాచ్ రాజకీయ కుట్ర ఏంటో ఎవరెవరి నెంబర్స్ ట్యాపింగ్‌ చేశారో ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్స్ క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. వరంగల్, మహాబూబ్ నగర్, సిద్దిపేట్, నిర్మల్ లో ప్రత్యేక సెటప్‌లు ఏర్పాటు చేసుకొని మరీ ట్యాపింగ్‌కి పాల్పడ్డారు. ఇందుకు ‘నేను’ న్యూస్ యజమాని, గుమస్తా తెలంగాణ ఓనర్ ప్రత్యేక వింగులుగా ఏర్పడి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేవారని ప్రణీత్ రావు దర్యాప్తులో తేలింది. నల్గొండ, జహీరాబాద్ నేతల అనుచరుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారు. వాట్సాప్ నుంచి మొదలుకొని ఫోన్స్‌లో ఏం జరిగినా ఇట్లే పసిగట్టేవారు.
ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్లు ఇవే
మ*ష్ – 9160****44
జూ*** ఖాన్  – 9661****22
– 9000****58
యె*** రెడ్డి – 6300****73
ఝా* రెడ్డి – 9959****93
మే* రెడ్డి – 9494****66
వి*జ్  ఖమ్మం – 9949****66
జీ*ఆర్ టోల్ మనుషులైన
అ*ల్ రెడ్డి -9849****67
శ్రీ*ర్ రెడ్డి – 7702****32
రా** రెడ్డి – 966***09
ఇలా కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసి ఫోన్స్ టాప్ చేశారు. నిత్యం వారి నీడలా వెంటాడారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే. అంటే అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవచ్చు. ట్యాపింగ్ కాకుండా హ్యాకింగ్‌కు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రత్యర్ధి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. ప్రణీత్ రావు వరంగల్ జిల్లాలోని ఓ మాజీ మంత్రికి బంధువు. మాజీ మంత్రి కోసం వరంగల్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతని బంధువుల ఇంట్లోనే వార్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి గెలుపు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. వరంగల్‌ జిల్లాలో జరిగిన వ్యవహారాలపైనా పోలీసులు దృష్టిసారించనున్నారు. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్యాపింగ్ చేయడం కష్టంగా మారడంతో చివరి మూడు రోజులు చేతులు ఎత్తేసినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేశాడు దుగ్యాల ప్రణీత్‌ రావు. అప్పటి అధికార పార్టీ కోసం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడంతో తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేష్‌ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ విచారణలోనే ఇప్పుడు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ కార్యాలయంలోని రెండు రూముల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా ఉపయోగించుకొని రహస్య సమాచారాన్ని సేకరించినట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాదు కొన్ని కంప్యూటర్లలో కీలక రికార్డులను కూడా మాయం చేసినట్టు గుర్తించారు. ఇదంతా గతేడాది  డిసెంబర్‌ నాలుగో తేదీన ధ్వంసమైనట్టు గుర్తించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కుల్లోకి ప్రణీత్ రావు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడిపై ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ, ఐటీ యాక్ట్‌ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో ప్రణీత్‌కు సహకరించిన వారిని కూడా గుర్తించి వారిపై కూడా నాన్ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణీత్‌ రావును అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో ఉంచి కీలక సమాచారం రాబడుతున్నారు. అతను ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్క్‌ల్లోని సమాచారాన్ని రిట్రైవ్‌ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.
                                                                    దేవేందర్ రెడ్డి -9848070809

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Congress: స్తంభాద్రిలో గెలుపు ఏకపక్షమే..

- లక్షకు పైగా మెజారిటీ లెక్కల్లో కాంగ్రెస్ - ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన విపక్షాలు - అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించిన హస్తం Khammam: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం సీటుకు ఎంతో చరిత్ర ఉంది....

Hyderabad Metro: భాగ్యనగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్

Hyderabad metro rail timings changed night service extended 45 minitues: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో నిర్వాహకులు శుభవార్త అందించారు. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక...

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలపై ఫోకస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో రాష్ట్ర అప్పుల భారం రూ.72,658 కోట్లు పదేళ్ల కేసీఆర్...