Phone Tapping Links, Errabelli As Next Target
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Phone Tapping: ట్యాపింగ్ లింక్స్.. నెక్స్ట్ టార్గెట్‌గా ఎర్రబెల్లి..!

– ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త పేర్లు
– కీలకంగా పర్వతగిరి వార్ రూమ్‌
– కమిషనరేట్ వదిలి వెళ్లొద్దని ముగ్గురు అధికారులకు ఆదేశాలు..?
– స్టేట్మెంట్ రికార్డుల తర్వాత మాజీ మంత్రికి నోటీసులిచ్చే ఛాన్స్
– కాంగ్రెస్ అభ్యర్థి పర్సనల్ లైఫ్ విషయాలు తెలుసుకుని రాజకీయం
– నల్గొండలోనూ ట్యాపింగ్ లింక్స్
– మూడో రోజు ట్యాంపరింగ్ కాదు, ట్యాపింగ్ పైనే విచారణ
– హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌ రావు


దేవేందర్ రెడ్డి- 9848070809

Phone Tapping Links, Errabelli As Next Target : ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ‘స్వేచ్ఛ’ అనుమానాలే నిజాలవుతున్నాయి. స్క్రీన్ షాట్స్‌తో పాటు పూర్తి ఆధారాలు, పోలీస్ అధికారుల పేర్లతో ఎక్స్ క్లూజివ్‌గా ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే బట్టబయలు చేసింది. ‘స్వేచ్ఛ’ కథనాలు ఇచ్చిన 5 రోజులకు మిగితా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవే విషయాలను ఫాలో అవుతూ వార్తలు ఇచ్చాయి. విదేశాల్లో ‘నేను’ న్యూస్ ఓనర్ అంటూ పోలీసులకు ఉప్పందించింది ‘స్వేచ్ఛ’.


దయాకర్ రావు ద్వంద్వ వైఖరి..!

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి దయాకర్ రావు, ప్రణీత్ రావు ఎవరో తెలియదని చెప్పడం విడ్డురంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రణీత్ రావు మేనమామలు జాలపల్లి సంతోష్ రావు, అడిషనల్ ఎస్పీ రామారావు, దయాకర్ రావుకి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఓ కేసులో స్టింగ్ ఆపరేషన్ అంటూ హడావుడి చేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్ రావు టీంలో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించాడు. అందుకు అప్పుడు టీడీపీలో ఉన్న దయాకర్ రావే ఉప్పందించి ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆనాటి మంత్రి ఓటమికి కారణాలు అవుతున్నాయని ఎన్ఐఏ ఆఫీస్ లో రికార్డ్ అయిన ఫీడ్ అంతా పర్వతగిరికి ఎందుకు తరలించారో విచారణలో తేలనుంది. 65 ఏండ్ల దయాకర్ రావుని, 26 ఏండ్ల ప్రత్యర్థి ఫర్సనల్ లైఫ్ విషయాలను ముందే ఫోన్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుని ప్రచారంలో ఉపయోగించుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెరచాటు ముచ్చట్లని రూల్స్‌కి విరుద్ధంగా విన్నారని, ఇప్పుడు దయాకర్ రావు తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడంపై పోలీసుల స్టేట్మెంట్స్ రికార్డ్స్‌తో అంతా తేలిపోతుందని అంటున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించకుంటే ఎంతటి వారినైనా అరెస్ట్ చేసేలా ఉండటంతో అసలు రంగు మరో వారం రోజుల్లో బయటపడనుందని సమాచారం.

Read More: నడుస్తున్న చరిత్ర, వేడెక్కిన తెలుగు రాజకీయం.!

నల్గొండలో ప్రభాకర్ రావు పని మనుషులు!

నల్గొండకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌‌కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయనకు నచ్చిన విలేఖరులను ఇన్ఫార్మర్స్‌గా పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆరా తీసేవారని తెలుస్తోంది. ఓ విలేఖరి 25 సంవత్సరాలుగా ప్రభాకర్ రావు పని మనిషిగా చేశారట. అయనతో పాటు ఎస్ఐబీలో పనిచేసిన వ్యక్తి అత్యంత రహస్యంగా ఉండాల్సిన విషయాలను దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి.. నో ఎవిడెన్స్

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు అధికారులు సాక్ష్యాధారాలు సేకరించారు. కానీ, రీట్రైవ్ చేసేలా పనికి రాకుండా చేశారని అంటున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇలాంటివే జరుగడం కామనే. 2019లో ఏపీలో ఓ ఇంటెలిజెన్స్ అధికారి 150 యాపిల్ ల్యాప్ టాప్స్ తగులబెట్టి ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ప్రణీత్ రావు రిజల్స్ట్ రోజు ఒక్క రోజే ఉండటంతో వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి ధ్వంసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఫాలో అప్ చేసిన టెర్రరిస్టులు, మావోయిస్టుల ఆధారాలు కూడా ధ్వంసం అయినట్టుగా అనుమానం.

హైకోర్టు మెట్లెక్కిన ప్రణీత్

హైకోర్టును ఆశ్రయించాడు ఫోన్‌ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌ రావు. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశాడు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. వాస్తవాంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని అందులో పేర్కొన్నాడు. పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని, విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని తెలిపాడు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆడియోలు విన్న పొలిటికల్ దయాకర్, దయాదాక్షిణ్యాలు లేకుండా వికృత చేష్టలకు పాల్పడిన సీఐ విశ్వేశ్వర్‌పై ఇకపై ఆధారాలతో ప్రత్యేక కథనాలు ఇవ్వనుంది ‘స్వేచ్ఛ’.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?