Telangana: ప్రభుత్వాలు మారుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వారి ఇబ్బందులు మాత్రం పరిష్కారం కావడం లేదు. నెల నెల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొన్ని శాఖల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యూవల్ కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. మరో వైపు కార్మికులంతా ఏజెన్సీలతో వర్క్ చేయడంతో వారు సైతం వేతనాల విషయంలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషన్లు సైతం ఎక్కువగా తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో 52శాఖలు ఉండగా, వాటిలో అనుబంధ కార్పొరేషన్లలో కలిపి సుమారు 2లక్షల మంది పనిచేస్తున్నారు. వారంతా నిరుద్యోగులు. మరోవైపు కుటుంబ పోషణ కోసం అవుట్ సోర్సింగ్ పరిధిన మొగ్గుచూపుతున్నారు. అయితే, వారికి వచ్చేది తక్కువ వేతనాలు. వారిని ఎంపిక చేసేది సైతం ఏజెన్సీలు. అయితే వచ్చే వేతనాలు సైతం ప్రభుత్వం ప్రతి నెల మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా వేతన చెల్లింపుల్లో జాప్యంతో కుటుంబ పోషణ భారమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక భారంతో మనోవేదనకు గురవుతున్నారు.
సర్కార్ మారిన తిప్పలు తప్పట్లే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు అనేది ఉండదని అందరి ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు మరోవైపు కొన్ని శాఖల్లో తొలగింపు ప్రక్రియను సైతం చేపట్టారు. కమర్షియల్ డిపార్టుమెంట్ లో తాత్కాలికంగా పనిచేస్తున్న 95 మందిని, ట్రెజరీ డిపార్టెమెంట్ల్ లో 70 మంది, ఆడిట్ శాఖలో 14 మందిని, ఎక్సైజ్ శాఖలో 40 మందిని, డిగ్రికళాశాలలో 30 మందిని, టీఎస్డీఎల్ఐ డిపార్టుమెంట్ లో 20 మందిని, రిజిస్ట్రేషన్ శాఖలో 155 మందిని ఈ మధ్యకాలంలో తొలగించింది. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరానికి మించి ఉన్నారనే కారణంతో అదనపు ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. సుమారు 19వేలకు పైగా ఇప్పటికే తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నారు.
జీవితం భారంగా మారి ఇబ్బంది
ఆయా శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం బాధ్యతలను ఏజెన్సీలకు గత ప్రభుత్వాలు అప్పగించాయి. అయితే వారు కమిషన్ బేస్ తో పనిచేయడంతో, ఆ ఏజెన్సీ ఖాతాల్లోనే వేతనాలకు సంబంధించిన అమౌంట్ జమచేస్తుంది. దీంతో ఏజెన్సీ సంస్థలు వారి కమిషన్ మినహా మిగతా అమౌంట్‌ను వేయడంతో నాలుగు వేలకు పైగా తగ్గుతుండటంతో అవుట్ సోర్సింగ్ పరిధిలో పనిచేసే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేగాకుండా కార్మికులకు సీనియార్టీగా బట్టి రూ.10 వేల నుంచి రూ.22,500 వరకు నెల వేతనంగా అందుతుంది. ప్రభుత్వం నెలనెల వేతనాలు మంజూరు చేయకపోయినా సంబంధిత ఏజెన్సీలు కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఏజెన్సీలు సైతం ప్రభుత్వంపై భారం మోపీ వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నదని, నెల తిరిగే సరికి పిల్లల ఫీజుల, ఇతర ఇంటి ఖర్చుల నేపథ్యంలో జీవితం భారంగా మారి ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలు పీఎఫ్, ఈఎస్ఐ లు సైతంచెల్లించకపోవడంతో కార్మికులకు ఇక్కట్లు తప్పడం లేదు.
Read Also-Siddharth: స్టేజ్‌పైనే కంటతడి పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. నన్ను ఏడిపిస్తున్నారంటూ..
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యూవల్ లేదు
ఇదిలా ఉంటే కొన్ని శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యూవల్ చేయలేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో పనిచేస్తున్న వారికి రెన్యువల్ ఇంకా రాలేదు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి సైతం రెన్యూవల్ ఆర్డర్ రాలేదు. ఇలా ఇంకా కొన్ని శాఖల్లోనూ రాకపోవడంతో ఉద్యోగంలో ఉన్నట్లా? లేదానాట్లా? అనేది అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నవారు మానసికాందోళనకు గురవుతున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు. అంతేగాకుండా ప్రభుత్వమే డైరెక్టుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ వేతనాలు ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఉద్యోగుల చేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. అంతేగాకుండా మంత్రులు సైతం పలు సందర్భాల్లో రాష్ట్రంలో ఇకా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని అందరూ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తారని ప్రకటనలు చేశారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వ దృష్టికి ఉద్యోగ కార్మికుల సమస్యలను తీసుకొచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. త్వరలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారంపై ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నామని అవుట్ సోర్సింగ్ జేఏసీ నాయకులు తెలిపారు. గతంలో బిస్వాల్ కమిటీ, సుప్రీంకోర్టు సైతం ఇంక్రిమెంట్, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సూచించినా అమలు కావడం లేదని పేర్కొంటున్నారు.
నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో
పలుశాఖల్లో పనిచేసేవారికి నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని వసతి గృహాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ అవుట్ సోర్స్ ఉద్యోగులకు 3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలోని బీసీ కాలేజీ హాస్టల్ ఉద్యోగులకు 9 నెలలు, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో పనిచేసేవారికి ఏప్రిల్, మే రెండు నెలల జీతం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో పనిచేసేవారికి రెండు నెలలు, శిశు సంక్షేమ శాఖ కింద పని చేసే బాల సదనంలో వారికి రెండు నెలలు, భూ భారతి ఆపరేటర్‌లకు 15 నెలలు, ఏసీబీలో పనిచేసేవారికి 2 నెలలు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసులో 2 నెలలు, కొత్తగూడెం-భద్రాద్రి జిల్లాలో బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ హాస్టల్ లో 8 నెలలు, సిద్దిపేట జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 6ఆరు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని జేఏసీ నాయకులు తెలిపారు.