Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఆయన మెయిన్‌గా నటించాలి.. సోలోగా నటించాలి కానీ, అంతమంది ఆర్టిస్ట్‌లు ఎందుకు అనేలా.. సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పుడు కొంత మంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఏదైనా బ్రిడ్జ్ కట్టాలంటే.. ఒక్కరితో కాదు అనేలా ‘కన్నప్ప’ టీమ్ నుంచి కూడా గట్టిగానే సమాధానం వచ్చింది. అయితే కొందరు మాత్రం ఇంత మంది నటీనటులతో చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి, ఆఖరికి దెబ్బకొడుతుందేమో అనేలా కూడా కామెంట్స్ చేశారు. అలాంటి వారంతా ఇప్పుడు సినిమా చూసి మాట్లాడండి అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు కౌంటర్స్ సంధిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలోకి వచ్చి, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో నటించిన వారందరికీ మంచి పాత్రలు లభించాయనేలా విమర్శకులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిజంగానే భారీ తారాగణం ఉన్నారు. మొదటి నుంచి ఈ విషయంలో విష్ణు చాలా ప్లాన్డ్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. విష్ణు, ప్రీతి ముకుందన్, మంచు మోహన్ బాబులతో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి వారంతా ఈ పాన్ ఇండియా సినిమాలో భాగమయ్యారు. అర్ధరాత్రి పడిన ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోగా, ఉదయం పడిన షోలతో జెన్యూన్ టాక్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్, మరీ ముఖ్యంగా చివరి 30 నుంచి 40 నిమిషాలు సినిమా వేరే లెవల్ అన్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాగే ప్రభాస్ పాత్రని డిజైన్ చేసిన తీరుని కూడా అంతా కొనియాడుతున్నారు. ఓ 5 నిమిషాలు లేదంటే, ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రని ప్రభాస్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు కానీ, చివరిలో అందరికీ దాదాపు షాకే ఇచ్చారు. సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్‌ను ప్రభాస్ అలా నిలబెట్టేశాడు. ప్రభాస్ డైలాగ్స్ విషయంలో రైటర్ తన పెన్నుకు పదును పెట్టాడు. ఇక ప్రభాస్ పెళ్లి డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్స్ హోరెత్తుతాయంటే.. డైలాగ్స్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడిగా గంభీరమైన పాత్రలో కనిపించి, తనదైన నటనతో మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించారు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి చెప్పేదేముంది. మహాదేవ శాస్త్రిగా ఆయన పాత్రలో జీవించేశాడు. ఆయన పర్సనాలిటీకి సరిపడే పాత్ర ఇందులో లభించింది. హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. కాకపోతే గ్లామర్‌గా కనిపించడంతో, గూడెం భామగా సహజంగా అనిపించదు కానీ, ఆమె పాత్ర వరకు ఆమె న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటన అయితే కెరీర్ బెస్ట్.. అంతే. అప్పటి వరకు ధ్వేషించిన తిన్నడు.. ఒక్కసారిగా తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. కాదు.. అలా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పిక్చరైజ్ చేశారు. మొత్తానికి తన నటనతో మంచు విష్ణు చాలా రోజుల తర్వాత మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ సినిమా కథను నమ్మి, ప్రేమించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టిన మోహన్ బాబు, విష్ణులపై ఫస్ట్ టైమ్ ప్రశంసల వర్షం కురుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు