KTR on Fine Rice scheme: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. తనదైన రాజకీయ చతురతతో దూసుకుపోతున్నారు. ఓ వైపు అభివృద్ధికి బాటలు వేస్తూనే సంక్షేమానికి సైతం ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Journey For Womans), ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu), ఉచిత గ్యాస్ (Free Gas Cylinder), రైతు భరోసా (Raithu Bharosa) వంటి పథకాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం (Sanna Biyyam Scheme)తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి. సన్నబియ్యంపై గత బీఆర్ఎస్ (BRS) పాలనలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రెండ్ చేస్తూ.. రేవంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో కేటీఆర్ ఏమన్నారంటే!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. ఓ యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కేటీఆర్ భోజనం చేస్తుండగా.. పక్కనే ఉన్న వ్యక్తి సన్నబియ్యం ఇస్తామని హామి ఇచ్చారు కదా ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇస్తామా? ఇయ్యమా? అన్న విషయాన్ని పక్కకు పెట్టి.. అభివృద్ధి, సంక్షేమం, జోడెద్దులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు వైరస్ చేస్తున్నారు.
కెమెరాల ముందు ఇంగ్లీషులో గప్పాలు తప్ప సబ్జెక్ట్ ఏడుంది మన టిల్లన్నకు?
రేవంతన్న కరెక్టే అన్నడు మనోడి గురించి pic.twitter.com/FWrJ4kHXFs
— Aapanna Hastham (@AapannaHastham) April 9, 2025
కేటీఆర్ పై సెటైర్లు
ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే దొంగసాకులు చెప్పి కేటీఆర్ పారిపోయారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. బిల్డప్ ఇద్దామని సదరు యూట్యూబ్ ఛానల్ వద్దకు వెళ్లి.. అప్పట్లో పరువు పోగొట్టుకున్నారని విమర్శిస్తున్నారు. సన్నబియ్యం ఖర్చు రూ.2000 కోట్లు అవుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం (Ex BRS Govt) వెనక్కి తగ్గిందని.. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ పేదల సంక్షేమం కోసం ధైర్యంగా ముందడుగు వేసిందని ప్రశంసిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి డైరింగ్ పాలిటిక్స్ అని అకాశానికెత్తుతున్నారు.
Also Read: Vishaka Crime: విశాఖలో ప్రేమోన్మాది.. కత్తితో స్వైర విహారం.. ఇంత క్రూరత్వమా!
3.10 కోట్ల మందికి లబ్ది
సన్నబియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి ప్రయోజం చేకూరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ స్కీమ్ అమలు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1200 అదనపు ప్రయోజం ప్రభుత్వం నుంచి కలగనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఏటా ఒక్కో ఫ్యామిలీకి రూ.14,400 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా దొడ్డుబియ్యం పంపిణీకి కేంద్రం తన వంతు వాటాగా నిధులను విడుదల చేస్తోంది. అయితే సన్నబియ్యం తీసుకురావడం ద్వారా ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రం రాష్ట్రానికి అందచేయదని రాష్ట్ర ప్రభుత్వ (Govt Officers) వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా భరిస్తుందని తేల్చిచెబుతున్నారు.