Solvo Jayaram Reddy
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Investigation: ఈ అక్రమార్కుడు.. చట్టానికి అతీతుడా?

బయటపడుతున్న సాల్వో బండారం
మొన్న బాపట్ల.. నిన్న జగిత్యాల?
పేలుడు పదార్థాలు ఇంకా ఎక్కడికి చేరాయో?
అక్రమ రవాణా లింకులు ఎక్కడిదాకా ఉన్నాయో?
జయరాం రెడ్డిపై కేసులున్నా అరెస్ట్‌ ఎందుకు కాలేదు?
అంతా మనీతో మేనేజ్ చేసుకుంటున్న వైనం
దండుగా ప్రజాప్రతినిధుల అండదండలు
అసాంఘిక శక్తులకు పేలుడు పదార్థాలు చేరవేస్తున్నా కన్నెత్తి చూడని వ్యవస్థలు
‘కీసర టు భూపాలపట్నం’ స్వేచ్ఛ కథనంతో అప్రమత్తమైన పోలీసులు?
విచ్చలవిడి అక్రమ విక్రయాలపై నిగ్గు తేల్చుతారా?
స్టాక్ తనిఖీలు చేసే అధికారాన్ని ఇప్పటికైనా ఉపయోగిస్తారా?


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
Swetcha Investigation: ‘ధనం మూలం ఇదం జగత్’ అని ఊరికే అనలేదు. పైసలు పడేస్తే ఎవరినైనా మ్యానేజ్ చేయొచ్చు, ఆఖరికి వ్యవస్థలను సైతం దారికి తెచ్చుకోవచ్చు అనేది సాల్వో ఇండస్ట్రీస్ తీరు. పేలుడు పదార్థాలను అక్రమంగా సప్లై చేస్తున్నా, కేసులు ఎన్ని ఉన్నా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నెల రోజుల క్రితం ఏపీలోని బాపట్ల జిల్లా మార్టుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 వేల కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయగా పట్టుబడ్డాయి. సాల్వో పేరుతో ఉన్న జెలిటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 180 బాక్సుల టండర్ బోల్ట్ జెలిటిన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఏ6 నిందుతుడిగా సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కంపెనీ కీసర పరిసరాల్లో ఉండడంతో ఎక్కడైనా కేసు నమోదు కాగానే కీసర ప్రాంతంలోని స్థానిక ఏసీపీకి సమాచారం అందివ్వాలి. కానీ, ఇప్పటి వరకు ఎవరూ సాల్వో కంపెనీల పేలుడు పదార్థాల అక్రమాలపై సమాచారం ఇవ్వలేదు. సాల్వో రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఇష్టానుసారంగా ఎంట్రీలు ఉన్నాయని గుర్తించినట్లు బాపట్ల పోలీసులు మీడియాతో మాట్లాడారు. దీంతో జయరాం రెడ్డి బండారం మొత్తం బయటకొచ్చింది.

సరిగ్గా నెలకు?
పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తులకు చేరుతున్నాయని హైదరాబాద్ నుంచి జగిత్యాల రూరల్ పోలీసులకు సమాచారం అందింది. స్పాట్‌తో సహా చెప్పేసరికి పోలీసులు తనిఖీలు చేసి మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్స్ అందించే ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ముగురుని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కాకపోతే, పోలీసులు ఎలాంటి ప్రెస్‌నోట్ విడుదల చేయలేదు. నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, పేలుడు పదార్థాలపై ఐడీఈఏఎల్ పవర్ అని ఉందన్నట్లుగా జగిత్యాల పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ కంపనీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. దాని మదర్ సంస్థ ఎక్కడ ఉందనేది పెద్ద డౌట్. సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన 4 కంపెనీలు ఉమ్మడి నల్గోండ జిల్లాలో ఉన్నాయి. ఇతని కంపెనీ నుంచే కాకుండా వాళ్ల కంపెనీల నుంచి కూడా సప్లై చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Read Also- Swetcha Investigation: కీసర టు భూపాలపట్నం.. ఇంకెన్నిచోట్లకో?

బార్ సిస్టమ్ ఎమైంది?
ఎక్స్‌ప్లోజివ్స్ దారి తప్పకుండా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎన్నో షరతులు పెట్టింది. బార్ కోడ్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం రోజుకు ఎన్ని తయారు అవుతున్నాయి, వాటి వరుస సంఖ్య నమోదు వంటివి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చివరికి ఎవరికి చేరుతుందో వాళ్లు బార్ కోడ్ ఎంట్రీ చేసి వాడుకోవాలి. కానీ, ఆ సిస్టమ్‌ను సాల్వో కంపెనీ ఫాలో కావడం లేదని తెలుస్తున్నది. భూమి తన పేరు మీద లేకుండా సిస్టమ్‌ను మేనేజ్ చేసి, రెగ్యులరైజేషన్ కాకుండానే 200 ఎకరాల్లో అక్రమంగా జయరాం రెడ్డి కంపెనీని నడుపుతున్నాడు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో రాజకీయ నాయకులకు, అధికారులను కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు.

అరెస్టులు ఉండవా?
దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వాళ్లకు కావాల్సిన పదార్థాలు ప్రధానంగా ఇలాంటి పేలుడు సామగ్రినే అక్రమగా తరలిస్తున్నారని, క్రషర్, సెల్లార్స్‌లో లైసెన్స్ లేకుండానే విచ్చల విడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, సాల్వో లాంటి కంపెనీలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం లేదు. కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిల్వలు, రవాణాను నియంత్రించలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలోని రాజంపేట్ పోలీస్ స్టేషన్‌‌లో కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్‌లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు భారీగా అమోనియం, నైట్రెట్ తరలించినప్పుడు జయరాం రెడ్డి పనే అని తేలింది. అప్పుడే నెబలాన్‌లోని బీరుట్లలో నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. అయినా ఈయన అక్రమాల గురించి పట్టించుకొనే నాథుడే లేడు. రోజుకు 100 టన్నుల వరకు వాడకం జరుపుతామని చెబుతుంటారు. మరో 150 టన్నులు వివిధ ప్రాంతాలకు కంపెనీలకు పంపిస్తామని ప్రకటించుకుంటారు. కానీ,మిస్ యూజ్ అవుతున్న తీరుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇలాంటి కబ్జాదారులకు, ఇల్లీగల్ పనులు చేసే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తేనే అందరూ భద్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం.

Read Also- Formula E Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ రియాక్షన్!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్