Indian Railways: రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచన చేసింది. తమ సూచన పాటించి సహకరించాలని కోరింది. అసలే సమ్మర్ సీజన్ అంటూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా రైల్వే కోరింది. ఇంతకు రైల్వే సూచించిన ఆ సూచన ఏమిటో తెలుసుకుందాం. అలాగే పాటిద్దాం.
ఇండియన్ రైల్వే.. ఎందరో ప్రయాణికుల సేవలో తరిస్తోంది. ఎందరో రైల్వే అధికారులు, సిబ్బంది అనునిత్యం తమ విధులు నిర్వహిస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. రోజురోజుకు రైల్వే ప్రయాణికుల సంఖ్య అధికం కావడం, అదే రీతిలో రైల్వే కూడా విస్తృత సేవలు అందిస్తూ ప్రయాణికుల అభినందనలు పొందుతోంది. అయితే ప్రయాణికులు రైల్వే నిబంధనలు పాటించాలని రైల్వే సూచిస్తోంది. టికెట్ తీసుకొని ప్రయాణం చేయడంతో పాటు, రైలులో ప్రయాణించే సమయంలో ఎటువంటి నిబంధనలు పాటించాలో రైల్వే పలుదఫాలుగా తెలుపుతోంది. తాజాగా ఓ సూచన చేసి, ప్రయాణికులు పాటించాలని కోరింది.
అసలే సమ్మర్ సీజన్.. ఎండలు మండిపోతున్నాయి. రైలులో ప్రయాణించే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. రైలు ప్రయాణమైతే కాస్త గాలి వీస్తుందన్న భావన ప్రయాణికులది. అందుకే కాబోలు సమ్మర్ సీజన్ లో రైళ్లు నిండి కనిపిస్తుంటాయి. అంతేకాదు సమ్మర్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి కాబట్టి, ప్రయాణికులు అధికంగా సుదూర ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి ప్రయాణికులు త్రాగునీటి సమస్యను ఎదుర్కోకుండా, రైల్వే అన్ని రైల్వే స్టేషన్ లలో నీటి సదుపాయాన్ని కల్పించింది.
ప్రతి రైల్వేస్టేషన్ లో తాగునీటి కుళాయిలు అందుబాటులో ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో అధిక దాహం వేస్తుంది కాబట్టి, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే కోరింది. అలాగే నీటి కుళాయిల వద్ద బాటిల్స్ నీటిని పట్టే వారు, బాటిల్ నిండిన అనంతరం అలాగే కుళాయి వదిలేసి వెళుతున్నారని, ఇలాంటి నిర్వాకంతో నీరు వృథా అవుతుందని రైల్వే అభిప్రాయ పడింది.
Also Read: Mahabubabad Crime: మరీ ఇంత దారుణమా.. ప్రియుడి కోసం బిడ్డనే.. తల్లి చేసిన ఘోరం!
ఇలాంటి పరిస్థితి చాలా రైల్వే స్టేషన్ లలో కనిపిస్తుందని, నీటిని వృథా చేయరాదని సూచిస్తోంది ఇండియన్ రైల్వే. ఇలా చేయడం వల్ల నీటి వృథాతో పాటు, ఇతర ప్రయాణికులకు నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, ప్రయాణికులు ఈ విషయాన్ని చిన్న సమస్యగా భావించవద్దని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. అలాగే రైళ్లలో కూడ టాయ్ లెట్ల వద్ద నీటిని ఇష్టారీతిన వృథా చేస్తున్నట్లు గుర్తించామని, ప్రయాణికులు నీటిని వృథా చేయకుండా సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. మరి ప్రయాణికులూ.. నీటిని వృథా చేయకండి.. రైల్వే అధికారుల సూచనలు పాటించండి.