Illegal Ventures (imagecredit:twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్

Illegal Ventures: రావిరాల చెరువులో భారీగా వెంచర్లు.. ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘనలు


Illegal Ventures: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో సర్ధార్‌నగర్‌కు ఆనుకుని ఉన్న రావిరాల చెరువు శిఖం భూమిలో వెంచర్లు వెలిశాయి. పదేండ్ల క్రితం ఓ రియల్టర్‌ 70 ఎకరాల విస్త్రీర్ణంలో వెంచర్‌ ఏర్పాటు చేసి క్రయ విక్రయాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం 90 శాతం ప్లాట్లు నీటమునిగే ఉన్నాయి. తాజాగా మరో రియల్టర్‌ ఇదే శిఖానికి ఆనుకుని ఉన్న మూడు ఎకరాల విస్త్రీర్ణంలో మీటరులోతు మట్టినింపి వెంచర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు ఇరిగేషన్(Irrigation), రెవిన్యూ(Revenue), హెచ్‌ఎండీఏ(HMDA), మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా ఎన్‌ఓసీ(NOCలు జారీ చేశారనేది ప్రశ్నర్ధకంగా మారింది.

కళ్లముందే భారీ భవనాలు..

మెయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌కు ఆనుకుని ఉన్న హిమాయత్‌ సాగర్‌(Himayathsagar) చెరువు శిఖం భూమి. ఎఫ్‌టీఎల్‌కు వంద మీటర్ల దూరం బఫర్‌జోన్‌ ఉంటుంది. నిజానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు కానీ.. ప్రస్తుతం ఆ సాగర్‌ శిఖం భూమ్లుల్లో కొంత మంది పెద్దలు గద్దల్లా వాలిపోయారు. నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల్లో మట్టి నింపుతూ పదలు సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్లముందే భారీ భవనాలు వెలుస్తున్నా.. సంబంధిత అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే… కానీ ఏ ఒక్కనిర్మాణాన్ని కూడా అడ్డుకున్న పాపాన పోలేదు. అంతేకాదు ఆయా నిర్మాణాలకు.. విద్యుత్‌ శాఖ కరెంట్‌ మీటర్లు కూడా జారీ చేస్తుండటం కొసమెరుపు హిమాయత్‌నగర్‌ గ్రామ శివారులోని గండిపేట చెరువు శిఖం భూమి. ఎన్టీఆర్‌ విద్యాసంస్థ ముందున్న స్మశానవాటిక నుంచి గండిపేట చేరువు శిఖానికి ఆనుకునే మరో చిన్నకుంట కూడా ఉంది. వీటి మధ్య నుంచి ఉన్న మట్టికట్టపై నుంచి గండిపేటలోని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌కు వెళ్లేందుకు చిన్నదారి కూడా ఉంది. ఇది పూర్తిగా 111జీఓ పరిధిలో ఉంటుంది. ఇక్కడ కేవలం పంటలు మాత్రమే సాగు చేసుకోవాల్సి ఉంది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇప్పటికే చెరువు నీటిలో మట్టి నింపి ఒక వైపు ఇటుక బట్టి నడుపుతుండగా.. దానికి సమీపంలోనే మరో భారీ నిర్మాణం, దాని చుట్టూ ప్రహరి కూడా వెలుస్తుంది.


అడుగడుగునా ఉల్లంఘనలే..

ఐటీ అనుబంధ రంగాల రాకతో రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌(Real estate) వెంచర్లుగా మారిపోయాయి. ప్రభుత్వ, అసెన్డ్‌, భూధాన్‌ భూముల్లో ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. వీటినిలో చెరువులు, కుంటలు, కాలువలు, గుట్టలు మాయమైపోయాయి. గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎకరం రూ.30 నుంచి 40 కోట్లు పలుకుతుండగా, శివారు ప్రాంతాల్లో రూ.కోటి నుంచి పది కోట్ల వరకు పలుకుతోంది. భూములకు ఒక్కసారిగా విలువ పెరగడంతో రాజకీయ ప్రముఖులు, అధికారులు, వ్యాపారులు వీటిపై దృష్టిసారించారు. చెరువులే కాదు స్మశానవాటికలను కూడా వదల్లేదు. జిల్లాలో చిన్నాపెద్ద అన్ని కలిపి 2132 నీటి వనరులు ఉండగా వీటి కింద 70067 ఎకరాల ఆయకట్టు ఉంది.

Also Read: Tragedy News: డల్లాస్​‌లో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

వీటి లో చాలా వాటికి ఎఫ్‌టీఎల్‌(FTL) సహా బఫర్‌జోన్లను గుర్తించలేదు. గుర్తించిన వాటిపై కూడా నిఘా లేదు. దీంతో ఆయా భూముల్లో అడ్డగోలుగా వెంచర్లు, నిర్మా ణాలు వెలుస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా యంత్రాంగం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్మకాస్తోంది. కనీసం తనిఖీలు చేయ కుండా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు నాలా కన్వర్షన్‌కు ఎన్‌ఓసీలు జారీ చేశారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారు. ఇక విద్యుత్‌ ఇంజనీర్లు వాటికి మీటర్లు జారీ చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని వెంచర్లు, నిర్మాణాలు నీటమునగడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణలను తొలిదశలోనే అడ్డుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవికావని కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికీ వారే ఎన్‌ఓసీలు జారీ చేశారు..

నిజానికి ఏదైనా భూమిలో వెంచర్‌ వేయాలంటే ముందు ఆ భూమిని నాలా కన్వర్షన్‌ కోసం డీటీసీపీ(DTCP), హెచ్‌ఎండీఏ(HMDA), జీహెచ్‌ఎంసీ(GHMC)లకు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు భూమి స్వరూపాన్ని పరిశీలించి, అక్కడ ఎలాంటి నీటి వనరులు లేవని, వివాదాలు లేవని నిర్ధారించు కున్న తర్వాతే నిరభ్యంతర(ఎన్‌ఓసీ)పత్రం జారీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన శాఖల అధికారులే ఎన్‌ఓసీ ఇవ్వడంతో ఆ తర్వాత మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. క్షేత్రస్థాయి అధికారులెవరూ అభ్యంతరం చెప్పక పోవడంతో ఉన్నతాధికారులు కూడా కళ్లుమూసుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు.

శిఖం భూముల్లో వెలిసిన వెంచర్లు, నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు లభించడం, బ్యాంకులు కూడా వీటికి రుణాలు మంజూరు చేస్తుండటంతో కొనుగోలు దారులు కూడా ఏమీ ఆలోచించకుండా ఆయా లోతట్టు ప్రాంతాల్లోని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్లాట్లన్నీ నీట మునిగి ప్రస్తుతమవి చెరువును తలపిస్తుండటంతో తీరా తాము మోసపోయామని భావించి లోలోన మదనపడుతుండటం విశేషం. రావిరాల, మీర్‌పేట్‌, తుర్కయాంజాల్‌, జల్‌పల్లి  సహా పలు చెరువు శిఖాల్లో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ వరదనీటిలోనే మునిగి కన్పిస్తుండటం గమనార్హం. అధికారులు నిర్మాణాలను ముందే అడ్డుకుని ఉంటే ప్రస్తుతం తమకు ఈ పరిస్థితి తలెత్తేది కాదని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Hrithik Roshan: ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా.. ‘వార్ 2’ రిజల్ట్‌పై హృతిక్ రోషన్ షాకింగ్ పోస్ట్!

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?