DMart Independence Sale (Image Source: Twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!

DMart Independence Sale: 2025 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డీమార్ట్ (DMart) అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 7న మెుదలైన ఈ సేల్.. ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో కిరాణా సామాగ్రి, గృహోపకరణాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువులపై గణనీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇంతకీ ఏ వస్తువులపై ఎంత శాతం డిస్కౌంట్ పొందవచ్చు? షాపింగ్ కోసం అనుసరించాల్సి చిట్కాలు ఏంటీ? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.


డిస్కౌంట్లు, ఆఫర్ వివరాలు…
డిమార్ట్ లో విక్రయించే కిరాణా సామాగ్రి, గృహోపకరణాలు, దుస్తులు, ఇతర రోజువారీ అవసరమైన వస్తువులపై 85% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అనేక ఉత్పత్తులపై ‘బై 1 గెట్ వన్’ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటానియా జిమ్ జామ్ కుకీస్ ధర రూ.120 కాగా.. దానిని రూ.60కే డిమార్ట్ లో విక్రయిస్తున్నారు. బ్రిటానియా చీజ్ స్లైసెస్ (400 గ్రాములు) ధర రూ.460 కాగా దానిని రూ.230కే డిమార్ట్ అందిస్తోంది. వీటితో పాటు టాయిలెట్ క్లీనర్లు, డిష్‌వాష్ జెల్, బెల్లం ముక్కలు, బిస్కెట్లు వంటి ఉత్పత్తులు సగం ధరకే లభిస్తున్నాయి.

కాంబో ఆఫర్లు
పంద్రాగస్టు సేల్ సందర్భంగా పలు వస్తువులపై కాంబో ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను ఒకేసారి తీసుకునేవారికి ధరలో 20 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. సబ్బులు, వంట వస్తువులు, కూల్ డ్రింక్స్, గృహోపకరణ వస్తువులను కాంబో ఆఫర్ లో తీసుకోవడం వల్ల ఒక్కో వస్తువుపై రూ.20-30 వరకూ తగ్గింపు పొందవచ్చు.


ఉత్పత్తుల వారీగా రాయితీలు..
డీమార్ట్ లో వివిధ రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కిరాణా సామాగ్రి విషయానికి వస్తే పప్పులు, డ్రై ఫ్రూట్స్, వంట నూనె, నెయ్యి, బియ్యం, మసాలాలు, ఉప్పు, చక్కెర, బెల్లం, బిస్కెట్లు, స్నాక్స్, చాక్లెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి వస్తువులు బయటి షాపులతో పోలిస్తే తక్కువ ధరకే ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ కెటిల్స్, జ్యూసర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇండక్షన్ కుక్ టాప్ లు, డిన్నర్ సెట్లపై కూడా 20-30 శాతం డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ అయిన స్కిన్ కేర్, హెయిర్ కేర్ క్రీమ్స్, సబ్బులు, షాంపులు డియోడరెంట్లు, మేకప్ ఉత్పత్తులపై 40-50% డిస్కౌంట్ పొందవచ్చు. డైపర్లు, బేబీ సోప్, మసాజ్ ఆయిల్, బొమ్మలు, స్కూల్ సప్లైస్ వంటివి రూ.53 నుండి ప్రారంభమవుతాయి. పూజా సామాగ్రి అయిన అగర్బత్తీలు, దీపం నూనె, కొవ్వొత్తులు, కాంఫర్ వంటివి 45% వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Also Read: Youtuber Armaan Malik: బిగ్ బాస్ నటుడికి బిగ్ షాక్.. ఇద్దరు భార్యలతో సహా కోర్టు నోటీసులు.. ఎందుకంటే?

షాపింగ్ చిట్కాలు
పంద్రాగస్టు సేల్ విషయాన్ని పక్కన పెడితే సాధారణంగా డీమార్ట్ లో ఏ ఏ రోజుల్లో షాపింగ్ చేస్తే బెటర్ ఆఫర్లు పొందవచ్చు ఇప్పుడు చూద్దాం. శుక్ర, శని, ఆదివారాల్లో డీమార్ట్ లో షాపింగ్ చేస్తే వీకెండ్ సెల్స్ సందర్భంగా వస్తువులపై భారీగా రాయితీలు పొందవచ్చు. సోమవారం కూడా కొన్ని సందర్భాల్లో అధిక మెుత్తంలో రాయితీలు ఇస్తుంటారు. వారాంతంలో మిగిలిపోయిన స్టాక్ ను క్లియర్ చేయడానికి సోమవారాల్లో అదనపు తగ్గింపులు ఇస్తుంటారు. అయితే ఇవి అన్ని డీమార్ట్ స్టోర్లలో లభించకపోవచ్చు. ఇక రద్దీ తక్కువగా ఉన్నప్పుడు షాపింగ్ చేయాలని భావించేవారు.. మంగళ, బుధ, గురువారాల్లో డీమార్ట్ కు వెళ్తే మంచింది. ఆ రోజుల్లో తాజాగా స్టాక్ అందుబాటులో ఉంటుంది. ప్రతీ బిల్లులో రూ.150-250 వరకూ ఆదా అవుతుంది. ఇక డీమార్ట్ రెడీ యాప్ లో వస్తువులు ఆర్డర్ చేస్తే 50 శాతం వరకూ డిస్కౌంట్లు పొందవచ్చు. అయితే ఆఫర్లో ఉన్న వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యత, ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరిగా పరిశీలించండి. సొంత షాపింగ్ బ్యాగ్ ను తీసుకెళ్లడం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే లగేజీ కవర్ కు అదనంగా రూ.10-30 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read This: TG Rains Today: బిగ్ అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. స్కూళ్లు మూసివేత!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది