BRS Party
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BRS Party: అసలు మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?

BRS Party: గులాబీ పార్టీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సొంత పార్టీ నేతలపైనే కుట్రలు పన్నుతున్నారా? కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా? రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా? నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది రాజకీయ వర్గాలతోపాటు పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుత పరిణామాలతో క్యాడర్‌లో కాస్త గందరగోళం నెలకొన్నది.


మీడియా ముందుకొచ్చిన ఇద్దరు నేతలు

పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియా (Social Media) లో ప్రచారం జరుగుతున్నది. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని, కేటీఆర్‌ (KTR) తో సయోధ్య లేదని ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ కవిత (Kavitha) పై ప్రచారం ఊపందుకున్నది. అయితే, హరీశ్ రావుపై జరుగుతున్న ప్రచారంపై మాత్రం కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కవిత విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారా? లేకుంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయా? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం? పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమేనా? లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని స్వయంగా వారే మీడియా ముందుకు వచ్చి ఖండించుకున్నారు. అసలు ఇదంతా ఎవరు వారిపై చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.


కేసీఆర్ ఆలోచన ఏంటి?

హరీశ్ రావు, కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎవరు ఏం చేస్తున్నారు? దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు? పార్టీపై ఎలా స్పందిస్తున్నారు? బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారనే వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? తదితర వివరాలను సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ‘నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, అనేక ఆరోపణలు, కుట్రలు జరుగుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని స్పష్టం చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు, క్యాడర్‌లో చర్చకు దారితీశాయి. ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో రకరకాల అనుమానాలకు దారి తీసింది.

Read Also- Vemulawada: రాజన్న ఆలయం చుట్టూ రచ్చ.. ఎందుకిలా?

హరీశ్ వ్యాఖ్యల ఉద్దేశమేంటి?

మరోవైపు, హరీశ్ రావు సైతం మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించుకున్నారు. పార్టీ మారుతానని, జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైగా, కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ‘మై లీడర్ ఈజ్ కేసీఆర్, వాటెవర్ కేసీఆర్ సే హరీశ్ రావు విల్ ఫాలో’ అని పేర్కొన్నారు. అయితే, అధిష్టానం మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారా? లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేతలంతా సమిష్టిగా ఉండాల్సిన సమయంలో ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చి పార్టీపై క్లారిటీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లు అయింది.

ప్లాన్ ప్రకారమే ఇద్దరూ ముందుకు..

మరోవైపు, పార్టీలోనే నాయకులుగా ఉంటూ వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాలని ప్లాన్ ప్రకారం ఇద్దరు ముందుకెళ్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. అందుకే అందివచ్చిన ప్రతి అంశాన్ని వదలకుండా స్పందిస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతున్నది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో ముందుకు సాగుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఏదో ఒక అంశంతో వెళ్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిత్యం ఏదో ఒక అంశంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా సమిష్టిగా అగ్ర నేతలంతా ముందుకెళ్తే మరింతగా పార్టీ బలోపేతం అవుతుందని, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధినేత కేసీఆర్ అగ్ర నేతలందరినీ ఎలా ముందుకు నడిపిస్తారు? ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారనేది చూడాలి.

Read Also- PM Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. భారీగా ఏర్పాట్లు.. ఎందుకంటే..?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు